ముంబాయి ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ క్యూన్ హో గయా నా అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది కానీ తనకు గుర్తింపు రాలేదు. ఈ హిందీ హీరోయిన్ బాలీవుడ్ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ట్రై చేసి... చివరికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేసింది. అదృష్టవశాత్తు ఆమెకు కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కళ్యాణం సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా దర్శకుడు తేజ ఆమెను అచ్చ తెలుగు అమ్మాయిలాగా చూపించాడు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆమె పోషించిన లక్ష్మి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా 2007 వ సంవత్సరం లో విడుదలై ఓ మాదిరి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత అదే సంవత్సరంలో చందమామ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ సినిమాలో కాజల్ అగర్వాల్ మంచి గ్లామర్ పాత్రలో నటించి అందరిని మెప్పించింది.


ఈ చిత్రంలోని మహాలక్ష్మి క్యారెక్టర్ ను పోషించిన ఆమె... తన చీర కట్టు అందచందాలతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ క్రమంలోనే 2009వ సంవత్సరంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో కథానాయికి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది. మిత్రవింద, ఇందు పాత్రలలో నటించిన కాజల్ అగర్వాల్ కి ఎనలేని గుర్తింపు దక్కింది. ఆ సినిమా తర్వాత బడా స్టార్ల సరసన నటించే అవకాశాలు కాజల్ అగర్వాల్ కి పదుల సంఖ్యలో వచ్చి పడ్డాయి. ప్రభాస్ సరసన డార్లింగ్ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ తన లేలేత అందాలతో సెగలు పుట్టించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన బృందావనం సినిమాలో అమాయకపు అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను వెండితెరకి కట్టిపడేసింది.


ఆడపిల్ల లాంటి అగ్గిపుల్ల నేను అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించి ప్రభాస్ కంటే ఎక్కువగా పాపులర్ అయింది. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క బడా స్టార్ కాజల్ నే తమ సినిమాల్లో ఎంపిక చేసుకున్నారు అంటే ఆమె క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బృందావనం తో పాటు జూనియర్ ఎన్టీఆర్ సరసన టెంపర్,  బాద్షా సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది కాజల్ అగర్వాల్. మగధీర సినిమాని మినహాయించి రామ్ చరణ్ తో నాయక్, గోవిందుడు అందరివాడేలే చిత్రాలలో నటించింది. గోవిందుడు అందరివాడే చిత్రంలో చాలా సెక్సీగా కనిపించి ప్రేక్షకులకు సెగలు పుట్టించిందని చెప్పవచ్చు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అందరి హీరోయిన్ తో పోలిస్తే కాజల్ అగర్వాల్ కి అత్యంత సహజమైన ఎక్స్ప్రెషన్స్ తన మొహం పై పలికించే ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. సన్నివేశానికి తగ్గట్టుగా ఆమె చేసే ముఖ కవళికలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే పది సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో సాటిలేని హీరోయిన్ గా ఏకచక్రాధిపత్యం వహించింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: