కొంతకాలం క్రితం తాను మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాను అంటూ మీడియాలో తెగ హడావిడి చేసిన రేణు దేశాయ్ ఈమధ్య తన పెళ్లి విషయమై మౌనం కొనసాగిస్తోంది. ఈ మౌనం వెనుక అసలు రహస్యం తెలియక పవన్ అభిమానులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య మీడియాలోకి మళ్ళీ అందుబాటులోకి వచ్చిన రేణు దేశాయ్ అనేక విషయాల పై అనేక విషయాల పై స్పందిస్తోంది. 


ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ తన రెండవ పెళ్లి విషయమై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తాను ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తే తన పెళ్ళి గురించి అడుగుతున్నారని అందరు తన పెళ్లి గురించే ఎందుకు అడుగుతారో తనకు అర్ధం కావడం లేదని కామెంట్స్ చేసింది. 


అంతేకాదు ‘పెళ్ళి గోల’ అన్న టైటిల్ తో తన జీవితం పై తానే ఒక బయోపిక్ సినిమాను తీసుకుంటే తనకు బాగా డబ్బులు వస్తాయని అనిపిస్తోంది అంటూ జోక్ చేసింది. అయితే ప్రస్తుతం తాను హ్యాపీగా తన పిల్లలతో ఇంటిలో కాలం గడుపుతున్నానని అని చెపుతూ ఈ లాక్ డౌన్ సమయంలో తాను కొన్ని కవితలు రాసిన విషయాన్ని బయటపెట్టింది. 


ఇదే సందర్భంలో తాను సినిమాలలో నటించే విషయం గురించి మాట్లాడుతూ టాప్ హీరోల సినిమాలలో తల్లి పాత్ర చేస్తానని అయితే ఆ టాప్ హీరోల సినిమాలలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో వారి చిన్నప్పటి తల్లిగా కనిపిస్తాను కాని హీరోలు పెద్ద అయ్యాక వచ్చే సీన్స్ లో తాను తల్లిగా నటించను అని కండిషన్స్ పెడుతోంది. ఈమధ్య రేణు దేశాయ్ ఒక స్వచ్చంద సేవా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి మొక్కలు నాటే విషయంలో శ్రద్ద తీసుకోకపోతే భవిష్యత్ లో ప్రకృతి మనలను శపిస్తుంది అంటూ ఆమె తన కూతురు ఆద్య చేత కొన్ని మొక్కలు నాటించే వీడియోను ఈమధ్య కొన్ని ఛానల్స్ ప్రముఖంగా ప్రచారం చేసాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: