జులై 8 వ తారీకు నుండి ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తన తదుపరి చిత్రం అయిన పవర్ స్టార్ గురించి పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లో పవర్ స్టార్ పదాల మధ్య ఒక గ్లాస్ బొమ్మ పెట్టగా... అది జనసేన పార్టీ గుర్తు అని స్పష్టమవుతుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా... అందులో ఎన్నికల ఫలితాల తర్వాత అనే వాక్యం తో పాటు పవర్ స్టార్ మూవీ కథానాయకుడు ఫోటో కనిపించింది. దీన్ని బట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల గురించి రామ్ గోపాల్ వర్మ చూపించబోతున్నాడు అని తెలుస్తుంది.

ఫస్ట్ లుక్ పోస్ట్ చేసిన ఒక గంట తర్వాత పవర్ స్టార్ సినిమాలోని ఒక స్టీల్ ని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. నేను చేస్తున్న పవర్ స్టార్ సినిమా నుండి ఇద్దరు సోదరులు గడుపుతున్న క్షణం అని ఆ పోస్ట్ కి క్యాప్షన్ పెట్టాడు. ఈ ఇద్దరు సోదరులు పవన్ కళ్యాణ్, చిరంజీవి లాగానే ఉన్నారని నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. పవర్ స్టార్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న  నటుడు అందరికంటే శక్తివంతమైన వాడని రాంగోపాల్ వర్మ మరొక పోస్ట్ లో పేర్కొన్నాడు.
'గోడపై చేగువేరా ఫోటో ఉన్న రూమ్ లో భారతీయ చీర కట్టుకున్న ఒక రష్యన్ మహిళ నిల్చొని ఉండగా... ఫ్రెంచ్ నుండి స్వీకరించబడిన పాపిలాన్ ని పవర్ స్టార్ చదువుతున్నాడు. నిజంగా ఈ సినిమాలోని కథానాయకుడు ఒక గ్లోబల్ స్టార్', అంటూ ఇంకొక స్టిల్ ని తన సినిమా నుండి విడుదల చేసాడు రామ్ గోపాల్ వర్మ. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పోలిన వ్యక్తితో పవర్ స్టార్ కలిసి మాట్లాడుతున్నట్టు ఇంకొక ఫోటో ని విడుదల చేశాడు. పవర్ స్టార్ పొలంలో వరి కోసినట్టు, ఆవులకి మేత వేస్తున్నట్టు ఉన్న ఫోటోలను కూడా విడుదల చేశాడు. అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ ని పోలి ఉండటంతో రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
పవర్ స్టార్ సినిమా గురించి పవన్ కళ్యాణ్ కి దృష్టికి కూడా తీసుకెళ్లారు జనసేన పార్టీ అభిమానులు. అయితే ఇదంతా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఒకేసారి గట్టిగా నవ్వి... అతను నా మీద ఏ సినిమా అయినా తీసుకొనివ్వండి. మనం లైట్ తీసుకుందాం. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క నేత ఇలాంటి అనుభవాలను ఎదుర్కొనే ఉంటాడు. ఎన్టీరామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఎన్నో సినిమాలు అతనిపై రూపొందించబడ్డాయి.
మొన్నీ మధ్య కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు వచ్చాయి. ఇటువంటి సినిమాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మనం ఒకవేళ ఈ సినిమా గురించి మాట్లాడితే మనకే నష్టం. ఈ సినిమాకి అనవసరంగా పబ్లిసిటీ ఇచ్చినట్టు, ప్రచారం చేసినట్టు అవుతుంది. దాని గురించి మర్చిపోండి అని పవన్ కళ్యాణ్ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: