రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయ్యాయి. ఈచిత్రానికి రాధే శ్యామ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు అయితే ఫస్ట్ లుక్ మాత్రం ఊహిచినంతగా లేదు. ఇక ఈసినిమా క్యాస్ట్ అండ్ క్రూ ను కూడా ప్రకటించారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో కృష్ణం రాజు ,భాగ్య శ్రీ ,ప్రియదర్షి, మురళి శర్మ , షాషా ఛత్రి, సచిన్ కెడ్కర్,కునాల్ రాయ్ కపూర్ ,సత్యాన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ గా రవీందర్ రెడ్డి వ్యవహరిస్తుండగా  ఎడిటింగ్.. కోటగిరివెంకటేశ్వర రావు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తుండగా యువీ క్రియేషన్స్ , గోపి కృష్ణ మూవీస్ ,టీ సిరీస్ కలిసి నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ వచ్చే ఏడాది తెలుగు తోపాటు తమిళ, మలయాళ , హిందీ  భాషల్లో విడుదలకానుంది. 
 
ఇక అన్ని చెప్పారు కానీ మ్యూజిక్ డైరెక్ట్ ను మాత్రం ప్రకటించలేదు. ముందుగా ఈసినిమాకు సైరా ఫేమ్ అమిత్ త్రివేదిని అనుకున్నారు కానీ ఆతరువాత అతను తప్పుకున్నాడు అయితే మళ్ళీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నే ఎంచుకునే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: