నివేద థామస్.. ఒక్క సినిమాతో ఎందరో మనసు దోచుకుంది. నాని జెంటిల్మెన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టి ఆ తర్వాత నిన్ను కోరి, జై లవ కుశ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇంకా ఇప్పటివరకు నివేద థామస్ తీసిన సినిమా 5 అయినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఓ మంచి స్థానాన్ని సంపాదించుకుంది. 

 

IHG

 

మంచి నటన.. అందంతో ఫ్యామిలీ డ్రామాస్, యాక్షన్ ఫిల్మ్స్, డిటెక్టీవ్ ఫిల్మ్స్ అన్ని సినిమాల్లో అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంటుంది. నిజానికి నివేద థామస్ చైల్డ్ ఆర్టిస్ట్. అయితే చిన్నప్పటి నుండి కూడా మళయాళంలో, తమిళంలోనే నటించింది. అందరిని మెప్పించింది. చిన్నప్పటి నుండి నటి అవ్వడం వల్ల నటనలో ఆరితేరింది ఈ భామ. 

 

IHG'Thalaivar's daughter' and life post ...

 

ఏ పాత్ర అయినా సరే.. అందులో జీవించేస్తుంది. ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఏ సినిమాలోనూ ఆమె అందాన్ని ఎరగా వెయ్యలేదు. మంచి డ్రస్సింగ్ స్టయిల్ తో అందరిని ఆకట్టుకుంది. సినిమా చూస్తే చాలు వావ్ అనిపించే రేంజ్ సినిమాలు చేసింది. జెంటిల్మెన్ సినిమాలో అయితే పీక్స్ లో నటించింది. 

 

IHG

 

నిజంగా తను ఆ సినిమాలో నటించిన తీరు చూస్తే ఎవరు కొత్త నటి అని అనుకోరు. అంత అద్భుతంగా నటించింది నివేద థామస్. ఇలా అందం అభినయం నివేద థామస్ సొంతం. మరి అందాల అద్భుత నటి త్వరలోనే మన స్టార్ హీరోల సరసన నటించనుంది. పవన్ కళ్యాణ్ సినిమా వకిల్ సబ్ లో, సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ సరసన నటించనుంది. మరి ఈ సినిమాలు ఎంత సూపర్ హిట్ అవుతాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: