మొత్తానికి ప్రభాస్ తన ఫ్యాన్స్ ఒత్తిడికి తలొగ్గాడు. ఎప్పటినుంచో ఊరిస్తున్న తన 20వ ప్రాజెక్టు గురించి ఒకేసారి రెండు అప్డేట్స్ ఇచ్చాడు. ప్రభాస్ లుక్ రివీల్ చేయట్లేదని సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన ఫ్యాన్స్ కు లుక్ ను, ఆడియన్స్ కు సినిమా టైటిల్ ‘రాధే శ్యామ్’ అని క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. సినిమా థీమ్ ఎలా ఉండబోతోందో కూడా ఒక క్లారిటీకి వచ్చేశారు. అయితే.. ప్రభాస్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడని మళ్లీ ఓ వాదన మొదలైంది.

IHG

 

ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ లో టెక్నికల్ టీమ్ మెయిన్ మెంబర్స్ పేర్లు ఉన్నాయి కానీ.. సంగీత దర్శకుడి పేరు మాత్రం లేదు. దీంతో మరో కన్ఫ్యూజన్ కు తెర తీశారు మేకర్స్. సైరా.. మూవీకి మ్యూజిక్ ఇచ్చిన అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. కానీ.. ఇందులో నిజం లేదని అమిత్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. అయితే.. మరొకరిని ఫైనల్ చేసుంటారని అనుకున్న ఫ్యాన్స్ కు రిలీజ్ అయిన పోస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇందులో సంగీత దర్శకుడు లేడు. చూస్తే.. సాహోకు చేసిన తప్పే ప్రభాస్ మళ్లీ చేస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.

IHG's fans trending Radhe <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SHYAM' target='_blank' title='shyam -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>shyam </a>as the title | telugucinema.com

 

సాహోకు కూడా లాస్ట్ మినిట్ లో జిబ్రాన్ తో మ్యూజిక్ చేయించారు. శంకర్-ఎహసాన్-లాయ్ మధ్యలోనే తప్పుకోవడంతో సంగీతం విషయంలో క్లారిటీ లేకసోయింది. దీంతో సినిమా విడుదలయ్యాక చూస్తే సాహో మ్యూజిక్ పరంగా డిజాస్టర్ అనే చెప్పాలి. ఇప్పుడు రాధే శ్యామ్ కు కూడా ఇదే కన్ఫ్యూజ్ మెయింటైన్ చేయడంపై ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ సినిమా, హీరోకు సరైన సంగీత దర్శకుడే దొరకటం లేదా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

IHG locks his next film after Radhe Shyam? - tollywood

మరింత సమాచారం తెలుసుకోండి: