ప్రపంచంలో ఇప్పుడు కరోనా వైరస్ తో ప్రజలు వణికిపోతున్నారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ దిక్కుమాలిన కరోనా మహమ్మారి ప్రపంచానికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఓ వైపు మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే.. మరోవైపు ఆర్థిక నష్టాలు జరిగిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,23,78,854  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,56,601 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 2,22,825 కరోనా కేసులు రికార్డయ్యాయి. అయితే  ఈ కరోనా ప్రభావం ఎక్కువగా అమెరికాలో కొనసాగుతుంది.  అగ్రరాజ్యంలో ఇప్పటివరకు మొత్తం 3,21,19,999 మంది కరోనాబారిన పడ్డారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 16,57,749 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 14,26,428 మంది కోలుకున్నారు.

 

గురువారం కొత్తగా 960 మంది కరోనా బాధితులు మరణించడంతో ఈ వైరస్‌తో మృతుల సంఖ్య 1,35,822కు చేరింది.  ఈ మద్య భారత్ లో కూడా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ప్రబలిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ మద్య మళ్లీ షూటింగ్స్ మొదలు పెట్టవొచ్చు అని కేంద్రం ప్రకటించింది. కాకపోతే కొన్ని నియమనిబంధనలు తప్పకుండా పాటించాలని ఆంక్షలు విధించింది. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సినిమా షూటింగులకు త్వరలోనే అనుమతి ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా స్పందించారు.

 

సినిమా సెట్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, అలా జరగదు, జరగబోదని ఆయన అభిప్రాయపడ్డారు.సెట్‌లో నటీనటులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సినిమా సెట్‌లో భౌతిక దూరం పాటించడమంటే రెండు పరస్పర విరుద్ధ విషయాలను కలపడమేనని అన్నారు. షూటింగులు ప్రారంభించినా ఖర్చు తడిసిమోపెడు అవుతుందని అభిప్రాయపడ్డారు. అంతే కాదు సెట్‌లో భౌతిక దూరం పాటిస్తామని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుందని అనుభవ్ సిన్హా తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: