కాంట్రవర్శీతో పబ్బం గడుపుకునే రామ్ గోపాల్ వర్మ మరో పెద్ద వివాదానికి తెరలేపాడు. పూర్తి కల్పిత కథ అంటూనే.. పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తున్నాడు. సినిమాకు పవర్ స్టార్ అనే టైటిల్ పెట్టాడు. పవన్, చిరంజీవి పోలిన వ్యక్తులతో సినిమా తీస్తున్నాడు. అదేమంటే. నిజ జీవితంలో పోలిన వ్యక్తులను పోలి ఉంటే అది యాధృశ్చికమే అంటూ.. తప్పించుకుంటున్నాడు వర్మ. పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను గురువారం రిలీజ్ చేశాడు. 

 

ఎవరో ఒక పెద్ద సెలబ్రెటీ జీవితంలోకి తొంగిచూడనిదే వర్మకు నిద్ర పట్టదు. కెరీర్ లేదు. ఈ దర్శకుడి టేకింగ్ తో బోర్ కొట్టి.. అభిమానులు సైతం పట్టించుకోవడం మానేశారు. దీంతో ఏదో ఒక వివాదాన్ని ఎంచుకుంటూ.. మనుగడ సాగిస్తున్నాడు వర్మ. చాలాకాలంగా పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన వర్మ.. ఎన్నికల తర్వాత కథ అని ట్యాగ్ లైన్ పెట్టి పవర్ స్టార్ మూవీ తీస్తున్నాడు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తయిన గ్లాస్ ను టైటిల్ లో చేర్చాడు. 

 

పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయాలని వర్మ అనుకోవడం ఆలస్యం హీరో దొరికేశాడు. కథ.. కథనం విషయంలో వర్మ చాలా వీక్ అయినా.. క్యారెక్టర్స్ కు సూటయ్యే వాళ్లను వెతికిపట్టుకోవడంలో మాంచి ఎక్స్ పర్ట్. పవర్ స్టార్ రోల్ పోషిస్తున్న నటుడు తన ఆఫీస్ కు వచ్చి వెళ్తున్న టైమ్ లో తీసిన వీడియోను టీజర్ గా రిలీజ్ చేశాడు. పవర్ స్టార్ రోల్ పోషిస్తున్న వ్యక్తి.. స్టార్స్ అందరికంటే చాలా పవర్ ఫుల్ అంటూ.. సోషల్ మీడియాలో తెగ మెచ్చేసుకున్నాడు. ఎప్పుడూ హీరోయిన్స్ అందాల గురించి భజన చేసే వర్మ ఫస్ట్ టైమ్ హీరోను మెచ్చుకొని.. పబ్లిసిటీ స్ట్రాటజీ చూపించాడు. 

 


రిలీజ్ చేసిన మరో స్టిల్ లో పవర్ స్టార్ తో పాటు అన్నయ్యను కూడా చూపించాడు. ఆ పాత్ర చిరంజీవికి డూప్ గా ఉంది. వర్మ చాలా కాలంగా చిరంజీవి.. పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చాడు. సోషల్ మీడియా వేదికగా తన రాతలతో ఇంతకాలం హీరోలను.. మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన వర్మ.. ఏకంగా ఈ మెగా బ్రదర్స్ ను తెరపైకి తీసుకొచ్చి తనదైన స్టైల్లో ఆడుకోవడానికి ఓటీటీని ప్లాట్ ఫామ్ గా ఎంచుకున్నాడు. సెన్సార్ ఉండదు కాబట్టి.. ఇంకెలా రెచ్చిపోతాడో చూడాలి. పవర్ స్టార్ ను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: