ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ అయి ఎనిమిది సంవత్సరాలు అయిన టైంలో నిర్మాత బండ్ల గణేష్ కి హరీష్ కి మధ్య గొడవ చోటుచేసుకుంది. కారణం తోస్తే ఎనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తావన అదేవిధంగా హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తావన తీసుకు రాకుండా మిగతా వారందరికీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దీంతో నిర్మాత బండ్ల గణేష్ తన పేరు హరీష్ శంకర్ ప్రస్తావించకపోవడం తో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరీష్ శంకర్ కి రీమేక్ సినిమాలు చేయటం తప్ప సినిమాలు సొంతంగా దర్శకత్వం చేసే నైపుణ్యం లేదని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. అంతేకాకుండా హరీష్ శంకర్ కి తానే లైఫ్ ఇచ్చినట్లుగా బండ్ల గణేష్ అప్పట్లో వ్యవహరించారు. దీంతో ఇదే తరుణంలో హరీష్ శంకర్ కూడా బండ్ల గణేష్ చాలా ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఈ గొడవ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

ఇదిలా ఉండగా ఇటీవల బండ్లగణేష్ కరోనా వైరస్ నుండి కోలుకున్న తర్వాత ఓ వెబ్ మీడియా చానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సదరు ఛానల్ యాంకర్ హరీష్ శంకర్ గొడవ ప్రస్తావనకు తీసుకొచ్చారు. దీనికి సమాధానంగా బండ్లగణేష్ ఆన్సర్ ఇస్తూ… ''అది అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు వచ్చే చిన్న గొడవ లాంటిది. ఆయన మంచి డైరెక్టర్. అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే సినిమా ఎందుకు చేయను. ఆయన అవకాశం ఇవ్వడమే అదృష్టం. ఆ రోజేదో కోపంలో అలా అనేశాను.

 

అప్పుడప్పుడు ఇంట్లో పిల్లల మీద భార్య మీద కూడా కోప్పడుతుంటా. తల్లి మీద కూడా అలిగి రెండు రోజులు మాట్లాడకుండా ఉంటాం. అంత మాత్రాన వారు మనవాళ్ళు కాకుండా పోతారా? అన్నదమ్ముల్లాంటోల్లం ఏదో కోపంలో అరుచుకున్నాం. చిన్న చిన్న ఈగోలతో వచ్చిన గొడవ. దాని గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్ వ్యవహారం'' అని చెప్పుకొచ్చారు. ఈ ఆన్సర్ విని చాలా మంది ఒక్కసారిగా షాక్ తిన్నారు. బండ్ల గణేష్ కి ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు అప్పుడేదో ఆవేశ పడ్డాడు… ఇప్పుడు బాగా కవరింగ్ చేయడానికి  ట్రై చేస్తున్నారు అంటూ  నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: