టాలీవుడ్ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ముందుగా 1965లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన తేనె మనసులు సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవడం జరిగింది. అప్పట్లో మంచి విజయం సాధించిన ఆ సినిమా తరువాత వరుసగా వచ్చిన అవకాశాలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగిన కృష్ణ, అనతికాలంలోనే ఎన్నో సూపర్ హిట్స్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు. టాలీవుడ్ లో కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి విభిన్న తరహా జానర్ల సినిమాలు చేయడంతో పాటు అప్పట్లో ఎన్నో సరికొత్త రకాల అత్యాధునిక టెక్నాలజీలను ఇక్కడికి తీసుకువచ్చారు కృష్ణ. 

IHG

ఇక హీరోగా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న సమయంలో తన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులతో కలిసి కృష్ణ సొంతంగా పద్మాలయ స్టూడియోస్ పేరుతో బ్యానర్ ని స్థాపించి, మొట్టమొదటిగా అగ్నిపరీక్ష సినిమాను నిర్మించారు. ఆ తరువాత విజయనిర్మలతో కలిసి కృష్ణ, ఇదే బ్యానర్ పై నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఎంతో గొప్ప విజయాన్ని అందుకుని పద్మాలయ బ్యానర్ వాల్యూ ని ఎంతో పెంచింది. దాని అనంతరం తమ బ్యానర్ పై వరుసగా తెలుగు సహా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాలు నిర్మించిన కృష్ణ సోదరులు, ఎన్నో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. 

 

కృష్ణ మూవీ కెరీర్ ని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఈనాడు, ముగ్గురు కొడుకులు, దేవుడు చేసిన మనుషులు వంటి భారీ హిట్ మూవీస్ ఇదే బ్యానర్ పై నిర్మించబడ్డాయి. ఇక కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు హీరోగా సామ్రాట్, అన్న చెల్లెలు, పచ్చతోరణం సినిమాలతో పాటు ఆయన చిన్న తనయుడు మహేష్ హీరోగా రూపొందిన వంశీ సినిమాను కూడా పద్మాలయ బ్యానర్ పై నిర్మించారు. కాగా ఈ దిగ్గజ బ్యానర్ నేడు సక్సెస్ఫుల్ గా 50 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పలువురు సూపర్ స్టార్ అభిమానులు, ప్రేక్షకులు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: