ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అనగానే ప్రధాన మీడియా ఎక్కువగా హడావుడి చేస్తూ ఉండేది అనే సంగతి తెలిసిందే. సినిమా వస్తుంది అంటే చాలు ప్రధాన మీడియా లో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదోక రూపంలో ఒక సినిమా గురించి ఏదోక విధంగా కథనం రాయడం జరిగేది. ఇప్పుడు ఆ పాత్రను సోషల్ మీడియా ఎక్కువగా పోషించే ప్రయత్నం చేస్తుంది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అనగానే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో హడావుడి అనేది ఉంటుంది అనే చెప్పాలి. 

 

ఇప్పుడు దాదాపుగా స్టార్ హీరోల సినిమాల్లో చాలా వరకు కూడా కొన్ని కొన్ని సన్నివేశాలను ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి సినిమా రేంజ్ ని పెంచే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు జనాలు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త ఏంటీ అంటే టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు తమ సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. సోషల్ మీడియాలో భారీగా అంటే పది లక్షలు లేదా 20 లక్షలు. 

 

ఇతర ప్రచారం తో పోలిస్తే అది చాలా చాలా తక్కువ. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు ఆ ఆలోచన చేస్తున్నారు. నిర్మాతలకు ప్రచార భారం లేకుండా సోషల్ మీడియా  టీం లను ఏర్పాటు చేసుకుని సినిమాలను ప్లాన్ చేస్తున్నారు జనాలు..  మరి అది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియదు గాని దాదాపుగా అందరూ హీరోలు ఇదే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. చూద్దాం అసలు ఎం జరుగుతుంది భవిష్యత్తు లో అనేది. ఇప్పుడు ఒక రెండు సినిమాలకు ఇదే విధంగా ప్లాన్ చేసారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: