రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత లో హీరోయిన్ గా చేసి తన అందం తో ఫాన్స్ ని సంపాదించుకున్న హీరోయిన్ నేహా శర్మ. ఆమెకు అక్కడి నుంచి స్టార్ హీరోయిన్ అవుతుంది వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం బాగానే జరిగింది గాని ఇప్పుడు మాత్రం అసలు ఆమె సినిమాలు చేయడం లేదు. ఆ సినిమా వచ్చి దాదాపు పదేళ్ళు అయింది. ఇక అక్కడి నుంచి ఆమె ఇప్పటి వరకు మన తెలుగు లో వరుసగా సినిమాలు చేయలేదు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా సరే ఆమెకు మాత్రం అవకాశాలు రావడం లేదు. 

 

ఇక స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేసే ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే... ఆమె ప్రభాస్ సినిమాలో ఒక పాత్రలో చేస్తుంది అని అంటున్నారు. ఆ సినిమాలో ఆమె కీలక పాత్రలో చేస్తుంది అని టాలీవుడ్ లో అంటున్నారు. ఆ సినిమాకు సంబంధించి ఇప్పుడు చర్చలు కాస్త జరుగుతున్నాయి అని త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజం ఎంత తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. 

 

ఆమె బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో ఇప్పుడు మంచి సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నా సరే ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు అనే చెప్పాలి చూడాలి మరి అసలు ఎం జరుగుతుంది అనేది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చెయ్యాలి అని భావిస్తున్న కీలక  పాత్రలు ఏ విధంగా ఉంటాయి ఏంటీ అనేది చూడాలి. ఒక రెండేళ్ళ పాటు ఇలా చేసి పెళ్లి చేసుకోవాలి అని భావిస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: