టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పూజ హెగ్డే. ఆమెకు చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అనే హోదా రావడం స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటీ అనేది చూస్తే స్టార్ హీరోల సినిమాల్లో ఆమె భారీగా డిమాండ్ చేస్తుంది. అసలే లాక్ డౌన్ లో నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో  ప్రభాస్ సినిమాకు కాస్త తగ్గాలి అని ఆమెను కోరినా సరే ఆమె మాత్రం అసలు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు అని భారీగా డిమాండ్ చేసింది అంటున్నారు. 

 

ముందు అనుకున్న దాని కంటే కాస్త వెనక్కు తగ్గి నిర్మాతలు ఆలోచన చేస్తే ఆమె  మాత్రం ఏ విధంగా కూడా తగ్గే అవకాశం లేదు అని నిర్మాతలకు స్పష్టంగా చెప్పింది అని సమాచారం. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో పూజ పాత్రను చాలా బాగా తగ్గిస్తున్నారు అని సమాచారం. ఈ విషయం మరో స్టార్ హీరో దృష్టికి కూడా వెళ్ళింది అని అతను కూడా ఆమెను అసలు వద్దు అని  చెప్పాడు అని సమాచారం. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు మన తెలుగు లో చాలా వరకు కూడా సినిమాలకు ఖర్చు తగ్గిస్తున్నారు. 

 

ఈ సమయంలో భారీగా డిమాండ్ చేస్తే నష్టపోవడమే కాదు నష్టాలు భారీగా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి అనే విషయం అందరికి స్పష్టంగా తెలుసు. అందుకే ఇప్పుడు పూజ ను స్టార్ హీరోలు అసలు వద్దు అని చెప్పారు అని అంటున్నారు. ఇక చిన్న చిన్న హీరోల సినిమాల్లో ఆమె చేసే అవకాశం లేదు కాబట్టి ఇక ఆమె దాదాపుగా టాలీవుడ్ కి దూరమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: