ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి కాస్త చర్చలు ఎక్కువగా నడుస్తున్నాయి. అందులో ప్రధానంగా మెగా నందమూరి హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దాదాపుగా షూట్ పూర్తి చేసినా సరే ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై ఇప్పుడు చాలానే చర్చలు ఉన్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు ఈ సినిమా విడుదల ఆధారంగా కొన్ని కొన్ని సినిమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఏడాది  వేసవిలో ఆచార్య సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. 

 

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో అంటున్నారు. అదే విధంగా ప్రభాస్ హీరో గా వస్తున్న రాధే శ్యాం సినిమా కూడా వాయిదా పడే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా వాయిదా వేసే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక మహేష్ సినిమాపై కూడా ఈ సినిమా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

అది ఏంటీ అంటే సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇక ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది చివర్లో విడుదల అయితే మాత్రం మహేష్ సినిమాపై కూడా దెబ్బ పడే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు మరి. అసలు ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుంది అనేది స్పష్టత మాత్రం దర్శక నిర్మాతలు ఇవ్వడం లేదు అనే చెప్పాలి. జక్కన్న కూడా ఈ సినిమా విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితి లో ఉన్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా వెయిట్ చేసే పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: