విజయ్ దేవరకొండ సపోర్ట్ తో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ సినిమాతో నటుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. అదే సినిమాతో డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమైంది. దొరసాని రిలీజ్ తర్వాత వెంటనే ఆనంద్ దేవరకొండ రెండు సినిమాలు ఎనౌన్స్ చేశాడు. అందులో ఒకటి విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో ప్లాన్ చేస్తుండగా మరోటి ఆనంద్ ప్రసాద్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

 

నూతన దర్శకుడు వినోద్ అనంతోజు డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు మిడిల్ క్లాస్ మెలోడీస్ టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా జాను, చూసి చూడగానే సినిమాల్లో నటించిన వర్ష బొల్లమ్మ నటిస్తుంది. ఇక ఈ సినిమాకు కేరాఫ్ కంచెరపాలెం సినిమాకు మ్యూజిక్ అందించిన అగస్తీ డైరెక్ట్ చేస్తున్నారు.

 

మిడిల్ క్లాస్ మెలోడీస్ టైటిలే మ్యూజిక్ ప్రాధాన్య్త ఉంది అంటే.. సినిమా మ్యూజిక్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. కేరాఫ్ కంచరపాలెం సినిమా మ్యూజిక్ పరంగా కూడా చాలా స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అందుకే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాకు అగస్తి క్రేజీ మ్యూజిక్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది.. సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. రౌడీ హీరోగా యువ హీరోల్లో మంచి జోస్జ్ కనబరుస్తున్న విజయ్ దేవరకొండ ఇంటి నుండి హీరోగా వచ్చిన ఆనంద్ దేవరకొండ తను కూడా హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ యువ హీరో ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.           

మరింత సమాచారం తెలుసుకోండి: