రెండేళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎంతో ఎదురు చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో ఎట్టకేలకు సూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి రావడం జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించారు. ఇకపోతే ఈ సినిమాకు గాను యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్ ఎంతో పెద్ద సక్సెస్ సాధించాయి. సినిమాలోని మొత్తం అన్ని పాటలు కూడా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోయాయి. 

IHG

నేటి యువత భావాలకు అద్దంపట్టేలా ఈ సినిమాకు థమన్ అద్భుతమైన ట్యూన్స్ ని అందించడం జరిగింది. ముఖ్యంగా సినిమాలోని రాములో రాముల, సామజవరగమనా, బుట్ట బొమ్మ సాంగ్స్ మరింత గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. ఆడియో పరంగానే కాక వీడియోల పరంగా కూడా ఈ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపాయి. బుట్ట బొమ్మ సాంగ్ కు అయితే పలువురు సెలబ్రిటీలు టిక్ టాక్ వీడియోలు చేసి దానిని మరింతగా పాపులర్ చేసారు. ఇకపోతే నేడు బుట్టబొమ్మ వీడియో సాంగ్ ఏకంగా 260 మిలియన్లకు పైగా వ్యూస్ తో అలానే 1.9 మిలియన్ల లైక్స్ తో టాలీవుడ్ సినిమా చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్ గా సరికొత్త రికార్డు ని సొంతం చేసుకుంది. 

 

నిజానికి సినిమా రిలీజ్ అయి దాదాపుగా ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాలోని సాంగ్స్ ఇంకా ఇంతలా దూసుకెళ్తున్నాయి అంటే వీటికి ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కాగా దీనిని పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక ట్రెండ్ గా సెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: