జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక కల్పిత డ్రామా అయిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా... అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రావాల్సి ఉంది. తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కొమరం భీమ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తుందేమోనని అభిమానులు అంతా ఆశించారు కానీ వారి ఆశలపై నీళ్లు చల్లింది చిత్రయూనిట్. కాస్త ఆలస్యమైనా దిమ్మతిరిగే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ భారీ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలోపు చాలా కాలం పడుతుందని తెలుస్తోంది. అప్పటి లోపు జూ.ఎన్టీఆర్ కు సంబంధించిన మూవీ స్టిల్స్ విడుదల చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడతారు తెలుస్తోంది.


అయితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ వంటి చిత్రాలు చేసిన తర్వాత అతని సినిమా కెరీర్ ఆకాశం ఎత్తుకు ఎదిగింది. కానీ ఆ సినిమాల తర్వాత వచ్చిన సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ సినీ భవిష్యత్తుని పాతాళంలోకి తోచేసాయి. అతని తదుపరి సినిమాలు ఎంతగా డిజాస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు కారణం అతడు మంచి కథాబలం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకోకపోవడమే.


ప్రస్తుత విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజమౌళి తో కలిసి సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత తన తదుపరి సినిమాల పరిస్థితి ఏంటని జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు చేస్తున్నాడట.  గతంలో లాగా మళ్ళీ తన సినీ కెరీర్ గ్రాఫ్ పడిపోకూడదు ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాహుబలి వంటి పెద్ద హిట్ అందుకున్న ప్రభాస్ తదనంతరం సాహో లాంటి చెత్త సినిమా తీసి ప్రేక్షకులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు. స్క్రిప్ట్ ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే ప్రభాస్ అభిమానులు లాగానే తన ఫ్యాన్స్ మిగిలి పోకూడదని జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఆలోచన చేస్తున్నాడట. అందుకే కొత్త డైరెక్టర్లకు, ప్రయోగాలకు దూరంగా ఉంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అయినను హస్తిన పోయిరావలె సినిమాలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్టర్ ప్లాప్ సినిమా లతో సతమతమవుతున్న అల్లు అర్జున్ సినీ కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టాడు. అతడు తలుచుకుంటే ఏ హీరో సినీ కెరీర్ ని అయినా మార్చగల సామర్థ్యం ఉందని నిరూపించుకున్నాడు. ఇతడితో సినిమా తీస్తే కంపల్సరిగా సేఫ్ జోన్ లో పడి పోవచ్చని జూనియర్ ఎన్టీఆర్ భావించినట్లు తెలుస్తోంది.


గతంలో తమిళ డైరెక్టర్ శంకర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అట్లీ కుమార్ ఇప్పటికే హిట్ చిత్రాలను తమిళంలో తెరకెక్కించి 33 ఏళ్ళకే మంచి దర్శకుడిగా పేరు పొందాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఇతనితో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. తమిళ డైరెక్టర్ల క్రియేటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చే వారి సినిమాలు భారత దేశ వ్యాప్తంగా హిట్ అవుతాయి. ఈ నమ్మకంతోనే జూనియర్ ఎన్టీఆర్ అట్లీ కుమార్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. అలాగే కేజిఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంతి నీల్ తో కలిసి మరో సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించాడు. ఈ కన్నడ దర్శకుడితో చేసే సినిమా పాన్ ఇండియా మూవీ గా రూపుదిద్దుకుంటుందని తెలుస్తుంది. ఏది ఏదైనా తారక్ హిట్ దర్శకులతో సినిమాలు తీసే నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు బాగా ఖుషి అవుతున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: