యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే అందరికీ తెలిసిందే. ఆయన డార్లింగ్. అటు సినిమా ఫ్యాన్స్ కే కాదు, ఇటు ప్రొడ్యూసర్స్ కి కూడా స్వీట్ డార్లింగ్. ఇక హీరోయిన్స్ కి చెప్పనక్కరలేదు. ఆయన యువరాజే. ప్రభాస్ చాల కూల్ పర్సన్ అంటారు. అతనితో కలసి మూవీస్ చేయాలని నిర్మాతలే కాదు, దర్శకులే కాదు, హీరోయిన్లూ కోరుకుంటారు.

IHG

దాదాపు రెండు దశాబ్దాల‌ క్రితం ఈశ్వర్ మూవీ ద్వారా ప్రభాస్ సినీ ఎంట్రీ ఇచ్చాడు. నాడు ప్రభాస్ క్రిష్ణంరాజు వారసుడు. ఇపుడు ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు. ఈ తేడా చాలు. క్రిష్ణంరాజు రెబెల్ స్టారిజాన్ని ఇంటెర్నేషనల్ లెవెల్ దాకా తీసికెళ్ళిన ఘనత ప్రభాస్ దే

IHG

ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రభాస్ ఈ రోజుకు ఇంతదాకా వచ్చాడు. నిజంగా ప్రభాస్ క్రిష్ణంరాజు గర్వించే స్థాయిలో ఉన్నాడు. ఇపుడు ప్రభాస్ పాన్ ఇండియా హీరో. టాలీవుడ్లో మరే హీరోకు లేని క్రెడిట్ ఇది. ఇదిలా ఉండగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్  పోస్టర్ విడుదల అయింది.

IHG

అందులో నిర్మాతల పేరులో ప్రమోద్, ప్రసీదా అన్నవి కనిపిస్తాయి. ప్రమోద్ అంటే ప్రభాస్ అన్నయ్య, మరి ప్రసీద ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. ఆమె ఎవరో కాదు, క్రిష్ణంరాజు పెద్ద అమ్మాయి. ఆమెకి సినిమాలా మీద ఆసక్తి ఉంది. అందుకే తన అన్నయ్య ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాకు నిర్మాత అయింది.

IHG

ఆమెకి ఇది ఆరంభం  మాత్రమే, ఫ్యూచర్లో మరిన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటోంది. దానికి అన్నగా ప్రభాస్  ఫుల్ సపోర్ట్ అంటున్నాడుట. మరో వైపు క్రిష్ణంరాజు కూడా కూతురు టేస్ట్ ని కాదనడంలేదు. సో అన్నతో ఈ చెల్లి ఎన్ని సినిమాలు తీస్తుందో. అవి ఎంత బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: