అవును మరి కొత్త ఏడాది చాలా బాగుంటుంది అని అంతా అనుకున్నారు. ట్వంటీ ట్వంటీ క్రికెట్  మ్యాచ్ లా సిక్సర్లు, బౌండరీలు కొట్టొచ్చు అని ఆశ పడ్డారు. తీరా చూస్తే ఏడాది మొదలవుతూనే కరోనా మహమ్మారిని మోసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఆగకుండా దంచికొడుతోంది. దాని వల్ల దారుణంగా ఇబ్బంది పడిన వాటిలో సినిమా ఇండస్ట్రీ అగ్రభాగాన ఉంది.

IHG

కరోనా రెండు నెలలు ప్రభావం చూపించి తగ్గుతుంది అనుకుంటే వీర విహారం చేస్తోంది. ఇపుడు కాలు కూడా బయట పెట్టకూడనంతగా వ్యాపించింది. ఈ నేపధ్యంలో సినిమాల షూటింగులు అన్నవి ప్రశ్నార్ధం అయ్యాయి. అంతే కాదు కొత్త సినిమాల రిలీజులు కూడా లేవని తేలిపోతోంది.

IHG

జూన్ లో షూటింగు మొదలెట్టి అగస్ట్ నాటికి సినిమాలను ధియేటర్లలోకి తేవాలని ఏప్రిల్లో అనుకున్నారు కానీ ఇపుడు చూస్తూంటే ఈ ఏడాది మొత్తానికే కరోనాతో  చెల్లు చీటి రాయాల్సిందేనని లెక్కలేసుకుంటున్నారు. ఎంత చెడ్డా కరోనా వదలదు అని అది నవంబర్ నాటికి మరింతగా ముదురుతుందని వైధ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే దసరా, దీపావళి, క్రిస్మస్ సంక్రాంతి  సీజన్ లను  కూడా దాటేస్తుంది అంటున్నారు.

IHG

అన్నీ దాటుకుంటూ వెళ్తే కొత్త ఏడాదిలోనే సినిమాల వూసు తలవాలేమోనని కూడా గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. అందుకే ఈ ఏడాది టాలీవుడ్ కి సంక్రాంతులు, దసరాలు లేవు, అలాగే పెద్ద పండుగలు అంతకంటే లేవు. అందరి ఆశలు సమ్మర్ పైనే. అంటే 2021 సమ్మర్ నాటికే సినిమాలు ఏమైనా వస్తే రావాలి. ఇది పక్కా అని డిసైడ్ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: