ఈ ఏడాది ప్రారంభంలో స్టైలిష్ స్టార్ బన్నీ తో ‘అలా వైకుంఠపురం లో’ సినిమా తెరకెక్కించి త్రివిక్రమ్ అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో అని త్రివిక్రమ్ ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నా విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా స్వాతంత్ర నేపథ్యంలో కల్పిత కథతో ఫిక్షన్ తరహాలో తెరకెక్కుతోంది. కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తుండగా రామ్ చరణ్… అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

 

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ‘RRR’ ఇంట్రెస్ట్ ప్రాజెక్టుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్పెషాలిటీ దక్కించుకుంది. ఈ సినిమా అయిన వెంటనే ఎన్టీఆర్ నటించబోయే సినిమా త్రివిక్రమ్ తో 30 సినిమా కావడంతో, పైగా రాజమౌళి తో చేసిన తర్వాత ఎన్టీఆర్….త్రివిక్రమ్ తో చేస్తున్నా నేపథ్యంలో ఈ సినిమా ఫ్లాప్ కాకూడదని సరైన స్టోరీ రెడీ చేయాలనీ త్రివిక్రమ్ పై నందమూరి అభిమానులు ఒత్తిడి చేస్తున్నారట.

 

కారణం రాజమౌళితో సినిమా చేసిన తర్వాత సదరు హీరోకి నెక్స్ట్ చేయబోయే చిత్రాలు ఖచ్చితంగా దారుణమైన ఫ్లాపులు పడతాయి అని టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఆ విధంగా ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్ గతంలో గడ్డుకాలం చూశారు. ఇందువలన త్రివిక్రమ్ ని ఎన్టీఆర్ కోసం అదిరిపోయే రేంజ్ లో స్టోరీ సెట్ చేయాలని ఇప్పటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారట. కచ్చితంగా ఎన్టీఆర్ 30వ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ‘అరవింద సమేత వీర రాఘవ’ కంటే భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: