తెర మీద రీల్ హీరోలు అనిపించుకున్న హీరోలు రియల్ లైఫ్ లో కూడా అనేక చారిటీలతో హీరోలుగా నిరూపించుకుంటారు. గత జనరేషన్ హీరోలైతే అప్పటి నటుల ఆర్ధిక పరిస్థితి బాగోకున్నా.. ఆరోగ్య పరిస్థితి బాగోకున్నా ఎంతోకొంత సాయం అందిస్తూ ఆదుకుంటూ ఉంటారు. ఇటువంటి ఘటనలను చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్.. వంటి సీనియర్ నటుల విషయంలో చూశాం. అటువంటి సంఘటనే ఇప్పుడు కమల్ హాసన్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో 90వ దశకంలో తన భారీ రూపంతో.. విలనిజంతో తెరపై మెప్పించిన పొన్నాంబళం విషయంలో చేశారు.

IHG

 

రీసెంట్ గా పొన్నాంబళం కిడ్నీ సంబంధిత వ్యాధికి గురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. పొన్నాంబళం ఆరోగ్య స్థితి తెలుసుకున్న కమల్ హాసన్ ఆయనను ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు. పొన్నాంబళంను ఫోన్ ద్వారా పరామర్శించారు కమల్ హాసన్. ఆయనకు అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. పొన్నాంబళం పరిస్థితిని తెలుసుకునేందుకు కమల్ ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పొన్నాంబళం హాస్పిటలైజ్ అయిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇందులో పొన్నాంబళం ఆక్సిజన్ పెట్టుకుని ఉన్నారు.

IHG

 

తెలుగు, తమిళ్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు పొన్నాంబళం. తెలుగులో చిరంజీవితో ఘరనామొగుడులో పొన్నాంబళం ఫైట్ అప్పట్లో సంచలనం. ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్ సినిమాల్లో కూడా పొన్నాంబళం నటించారు. కమల్ హాసన్ భారతీయుడు, అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, రజినీకాంత్ ముత్తు వంటి సినిమాల్లో కనిపించారు. భారీ రూపం, విలనిజానికి సరిపడా క్రూరత్వం పొన్నాంబళంలో సరిగ్గా ఉన్నాయి. దీంతో ఆయన అప్పట్లో ప్రముఖ హీరోలకు సరిసమానమైన ఫైటర్. తమిళ బిగ్ బాస్ సీజన్2లో కూడా పొన్నాంబళం పార్టిసిపేట్ చేశారు. 2011లో రాజకీయాల్లో కూడా ఎంటరయ్యారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: