కోలీవుడ్ ప్రొడ్యూసర్లు ఇప్పుడు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నష్టాల నుంచి బయటపడటానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు 50 పర్సంట్ తగ్గించాలని నిర్ణయించారు. అయితే హీరో స్వామ్య ఇండస్ట్రీలో ఈ కోతలు సాధ్యమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఈ కష్టకాలంలో టాప్ హీరోలు తగ్గడానికి రెడీ అంటారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. 

 

కోలీవుడ్ లో నిర్మాతల కంటే అభిమానుల హడావిడి ఎక్కువగా ఉంటుంది. రజినీకాంత్
అజిత్, విజయ్ అభిమానుల హంగామాకైతే లెక్కేలేదు. ఈ ముగ్గురిని ఒక రేంజ్ లో ఆరాధిస్తుంటారు అభిమానులు. ఈ ఫాలోయింగ్ చూసే వీళ్లకు వందల కోట్ల రెమ్యునరేషన్ లు ఇస్తున్నారు. 

 

రజినీయిజం, రజినీఫైడ్ లాంటి ఎమోషన్స్ తో థియేటర్స్ ను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్న హీరో రజినీకాంత్. బాక్సాఫీస్ తలైవాగా బోల్డన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ హీరో 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. అన్నాతే మూవీకి రజినీ 100కోట్లు అందుకుంటున్నాడనే టాక్ వచ్చింది. 

 

కోలీవుడ్ ను ఇప్పుడు ఊపేస్తున్న హీరో విజయ్. రజినీ కొంచెం స్లో అయిన త్వా విజయ్ హంగామా పెరిగిపోయింది. వరుసగా వందల కోట్లు కలెక్ట్ చేస్తూ టాప్ చైర్ కు దగ్గరయ్యాడు. ఈ క్రేజ్ తోనే మాస్టర్ సినిమాకు ఇళయదళపతి వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెబుతున్నారు. 

 

తమిళనాట హీరోలను డెమీ డాగ్స్ లా చూస్తారు. గుళ్లు కట్టి పూజలు కూడా చేస్తారు. అందుకే కోలీవుడ్ లో హీరోల డామినేషన్ ఎక్కువ. ఈ డామినేషన్ కే కోట్లు చెల్లిస్తారు నిర్మాతలు. అలా పెంచి పెద్ద చేసిన హీరోలను ఇప్పుడు తగ్గమంటే.. తగ్గుతారా.. రెమ్యునరేషన్ లు కట్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. 

 

అజిత్ చాలా సైలెంట్ గా కనిపిస్తాడు గానీ అతని మార్కెట్ మాత్రం వైలెంట్ అని అభిమానులు గొప్పగా చెబుతుంటారు. రజినీకాంత్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీని ఊపేసేది తలైవానే అంటూ థియేటర్ల దగ్గర హంగామా చేస్తారు.  ఈ ఫాలోయింగ్ తోనే అజిత్ కు 60కోట్లకు పైగా రెమ్యునరేషన్ వస్తోందని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: