బాహుబలి కంటే ముందు ప్రభాస్ నుంచి వరసగా సినిమాలు వచ్చేవి. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా తర్వాత సినిమా చేస్తూ అభిమానులని అలరించేవాడు. అయితే బాహుబలి ఫ్రాంఛైజీ  నుండి ప్రభాస్ నుంచి సినిమాలు రావడం బాగా నెమ్మదించాయి. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండటంతో సినిమా సినిమాకి రెండేళ్ళ గ్యాప్ వస్తుంది.

 

చెప్పాలంటే ప్రభాస్ లాంటి స్టార్ నుంచి ఇలా రెండేళ్ళకొకసారి సినిమా రావడం అంటే అన్ని రకాలుగా ఇబ్బందే. వరసగా సినిమాలు వస్తే ఇండస్ట్రీలో సక్సస్ రేట్ బాగా ఉంటుంది. కాని ప్రభాస్ వైపు నుంచి అలా కుదరడం లేదు. చెప్పాలంటే ఇలా రెండేళ్ళ గ్యాప్ 2013లో వచ్చిన మిర్చి నుంచే మొదలైందని చెప్పాలి. ఆ తరువాత ప్రభాస్ బాహుబలి 1 విడుదలకు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నారు.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మొదటి పార్ట్ 2015లో విదులయ్యింది. అలాగే బాహుబలి 2 కోసం మరో రెండేళ్లు పట్టింది. 

 

అయితే ఇలా రెండేళ్ళ గ్యాప్ ఇప్పటి నుంచి రాకుండా బాహుబలి తరువాత వరసగా నా నుంచి సినిమాలు వస్తాయని ప్రభాస్ చెప్పాడు. కాని మళ్ళీ అదే రిపీటయింది. సాహో మూవీ కోసం మరో రెండేళ్లు తీసుకున్నాడు. అయితే సుజీత్ ఈ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ సినిమా మలచాడు కాబట్టి టైం తీసుకోక తప్పలేదనుకున్నారు. ప్రభాస్ తర్వాత సినిమా నుంచైనా సంవత్సరానికోటి వస్తుందనుకున్నారు. కాని మళ్ళీ మళ్ళీ అదే జరుగుతోంది. తాజాగా ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ రాధే శ్యామ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ లో రిలీజ్ డేట్ 2021 ని క్లారిటీ ఇచ్చారు. దీంతో రెండేళ్లకు ఒక సినిమా అన్న సెంటిమెంట్ మళ్ళీ రిపీటయింది. మరి ఇది ప్రభాస్ కి సెంటిమెంట్ గా మారబోతుందా అన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో పెద్ద చర్చగా మారింది. 

 

ఇక ప్రభాస్ పూజా హెగ్డేల రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ నే కాదు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక త్వరలో తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ లోని మరికొన్ని ప్రాంతాల్లో సెట్స్ ని నిర్మించారు. ఆ సెట్స్ లోనే చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తుంది.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: