ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ వార్త ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. ఈ మరణ వార్త విని చాలా మంది రాజకీయ ప్రముఖులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సోషల్ మీడియాలో ఇది కలా నిజమా అన్న రీతిలో స్పందించారు. సుశాంత్ మూడు పదుల వయసులో ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం ఎవరు నమ్మలేకపోతున్నారు. చాలా భవిష్యత్తు ఉన్న టైంలో సుశాంత్ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని మరణించడం ఎవరూ నమ్మలేకపోతున్నారు.

IHG

ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం కూడా ఇంతవరకు బయటపడలేదు. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఎవరికి వారు సొంత అభిప్రాయం బాలీవుడ్ ఇండస్ట్రీ లో నెపోటిజం వలన సుశాంత్ మరణించాడని.. తెగ చర్చలు జరుపుకుని ఎవరికివారు ఇండస్ట్రీలో ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో సుశాంత్ మరణానికి కారణమంటూ వైరల్ చేశారు.

IHG

ఇదిలా ఉండగా సుధీర్ కుమార్ ఓజా అనే అడ్వకేట్ సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్... కరణ్ జోహార్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా బన్సాలీలపై కేసు నమోదు చేయాలని బిహార్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను తాజాగా బీహార్ న్యాయస్థానం కొట్టివేసింది. ఇలాంటివి కోర్టు పరిధిలోకి రావని న్యాయస్థానం తెలిపినట్లు సమాచారం. అసలు అతను ఎందుకు చనిపోయాడో ఎవరికీ అర్థం కాని తరుణంలో చాలా సుశాంత్ పేరు మీద అతిగా చేస్తున్న తరుణంలో బీహార్ న్యాయస్థానం చంప మీద కొట్టినట్లు తీర్పు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: