గతంలో ఫ్యామిలీ మొత్తానికి ఒక బేనర్ ఉండేది. నందమూరి ఫ్యామిలీ హీరోలకు రామకృష్ణ స్టూడియోస్.. దగ్గుబాటి ఫ్యామిలీకి సురేష్ ప్రొడక్షన్స్.. అక్కినేని హీరోలకు అన్నపూర్ణ స్టూడియోస్.. మెగా ఫ్యామిలీ హీరోలకు గీతా ఆర్ట్స్. అయితే రానురాను ప్రతీ ఫ్యామిలీలో బేనర్స్ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా బ్యానర్స్ పుట్టుకొచ్చాయి. రీసెంట్ గా తెరపైకి ఓ కొత్త బేనర్ వచ్చేసింది.

 

మెగా ఫ్యామిలీలో ఉన్న బేనర్స్ మరే ఫ్యామిలీలోనూ లేవనే చెప్పాలి. గీత ఆర్ట్స్ తో మొదలుకాగా.. ఆ తర్వాత పుట్టిన అంజన ప్రొడక్షన్స్ కు నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో పవర్ స్టార్ బేనర్ పెట్టి కాటమరాయుడు.. సర్దార్ గబ్బర్ సింగ్ తీశాడు.

 

మెగా ఫ్యామిలీలో ఎన్ని బేనర్స్ ఉన్నా.. చిరంజీవి ఫ్యామిలీలో ఒక్క బేనర్ కూడా లేదు. ఈ లోటును రామ్ చరణ్ తీర్చాడు. ఇంటి పేరునే బేనర్ గా మార్చి కొణిదల ప్రొడక్షన్స్ బేనర్ స్థాపించి చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 నిర్మించాడు రామ్ చరణ్. 

 

చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో బేనర్ పుట్టుకొచ్చింది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో బేనర్ స్థాపించి తొలి ప్రయత్నంగా వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టింది.  త్వరలో మెగా హీరోలతో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది ఈ మెగా డాటర్.

 

కూతురు అడగాలే కానీ.. డేట్స్ ఇచ్చేస్తాడు చిరంజీవి. కొణిదల ప్రొడక్షన్స్ తర్వాత చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండో బేనర్ ఇది. సుస్మిత ఖైదీ నెంబర్ 150.. సైరా సిినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించి.. మరోవైపు నిర్మాతగా అదృష్టం పరీక్షించుకుంటోంది. చూద్దాం ఈ మెగా డాటర్ అనుకుంది జరుగుతుందో లేదో..!




మరింత సమాచారం తెలుసుకోండి: