ఎన్ని కరోనాలు వచ్చినా మన హీరోలు మారరు. కరోనా వచ్చి ఇండస్ట్రీని మార్చేసిందని.. బడ్జెట్ తగ్గించిందని ప్రచారం నడుస్తోందే గానీ.. వాస్తవంలో అదేమీ కనిపించడం లేదు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి స్టార్స్ ససేమిరా అంటున్నారట. సిినిమా ఇండస్ట్రీలో ఫ్లాపులు.. హిట్ లు సహజం. 10 పర్సెంట్ మించి సక్సెస్ రేటు దక్కడం లేదు. 90 పర్సెంట్ ఫ్లాపులు వచ్చినా.. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఇలా ఇబ్బంది పడలేదు. కరోనా ధాటికి కుదేలైపోయింది. దేశంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ మొదలైనా.. థియేటర్స్ మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు. థియేటర్స్ లో సాధారణ పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. 

 

షూటింగ్స్ కు పర్మీషన్ వచ్చినా.. స్టార్ సినిమాలు ఇంకా మొదలు కాలేదు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాతే సెట్స్ పైకి వద్దామని పెద్ద హీరోలు నిర్ణయించుకున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఈ లోగా నిర్మాతలపై ఆర్థిక భారం భారీగా పడుతుంది. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో బడ్జెట్ తగ్గించాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించారు. నటీనటుల రెమ్యునరేషన్ లో కోత పడుతుందన్న చర్చ మూడు నెలలుగా నడుస్తోంది. అయితే.. పెద్ద హీరోలు మాత్రం ఇందుకు సమ్మతంగా లేరని ఓ నిర్మాత వాపోయారు.  

 

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో మన స్టార్స్ కు పెద్దగా తెలిసినట్టు లేదు. సినిమాలో డైలాగ్స్ వరకే పరిమితం. రియల్ లైఫ్ లో తగ్గరు. స్టార్ హీరోల సినిమాల ఫ్లాప్ అయినా.. తర్వాతి మూవీకి రెమ్యునరేషన్ పెంచారేగానీ.. తగ్గించలేదు. కరోనా సమయంలో అయినా.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటారనుకుంటే.. అదీ లేదట. నిర్మాత ఎటు పోతే మాకేంటి.. మాకు పారితోషికమే ముఖ్యమనే హీరోలో ఎక్కువ మంది ఉన్నారని ఓ ప్రొడ్యూసర్ సన్నిహితుల దగ్గర తన బాధను వెళ్లగక్కాడు. ఈ లెక్కన మనవాళ్లు రీల్ లైఫ్ లోనే హీరోలు.. రియల్ లైఫ్ లో కాదన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: