టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ కొట్టడంతో పాటు మ్యూజికల్ గా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు అప్పట్లో మణిశర్మ అందించిన సాంగ్స్ శ్రోతలను విశేషంగా అలరించాయి. అంతేకాక సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బిట్ సాంగ్స్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 

IHG

ఇక దాని తరువాత మహేష్ కెరీర్ మూడవ సినిమా వంశీ, దాని అనంతరం వచ్చిన మురారి, ఆపై వచ్చిన కౌబాయ్ సినిమా టక్కరిదొంగ, అనంతరం శోభన్ దర్శకత్వంలో మహేష్ చేసిన బాబీ, అలానే వాటి అనంతరం కెరీర్ పరంగా మహేష్ కు సూపర్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఒక్కడు సినిమాలకు మణిశర్మ అందించిన మ్యూజిక్ నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఆపై మరోక్కసారి గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ నటించిన అర్జున్, అలానే త్రివిక్రమ్ తో తొలిసారిగా మహేష్ చేసిన అతడు, ఆపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ పోకిరి, వాటి తరువాత వచ్చిన అతిథి, ఖలేజా సినిమాలకు కూడా మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు. వాటిలో వంశీ, టక్కరి దొంగ, అతడు, పోకిరి సినిమాల్లోని సాంగ్స్ అయితే ఎంతో పాపులర్ అయ్యాయి. 

 

బి గోపాల్ తో మహేష్ చేసిన వంశీ మూవీ పెద్దగా సక్సె కానప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ అక్కడక్కడా వినపడుతూనే ఉంటాయి. కౌబాయ్ జానర్ సినిమా టక్కరి దొంగ కు కూడా అద్బుతమైన సాంగ్స్ తో పాటు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మహేష్ అభిమానులు మరిచిపోలేరు అనే చెప్పాలి. అలానే అతడు, పోకిరి సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా సూపర్ స్టార్ మహేష్ తో మణిశర్మ మూవీ చేస్తున్నారు అంటే, అది ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవ్వవలసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: