టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి సీనియా అప్పట్లో ఎంతో పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా ద్వారా తొలిసారిగా పవన్ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం జరిగింది. ఈ సినిమాలోని దాదాపుగా అన్ని సాంగ్స్ కూడా మంచి మ్యూజికల్ సక్సెస్ సాధించడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా యువతను ఎంతో ఆకట్టుకుంది. 

IHG

ఇక దాని తరువాత పవన్, వీరశంకర్ ల కాంబోలో వచ్చిన గుడుంబా శంకర్, అలానే పవన్, కరుణాకరన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన బాలు సినిమాలకు కూడా మణిశర్మ అదిరిపోయే సాంగ్స్ అందించారు. వాస్తవానికి ఆ రెండు సినిమాలు కూడా సక్సెస్ కానప్పటికీ సాంగ్స్ మాత్రం శ్రోతలను అలరించాయి. ఇక ఆ తరువాత కొన్నేళ్ల గ్యాప్ అనంతరం జయంత్ దర్శకత్వంలో పవన్ నటించిన తీన్ మార్ తో పాటు పవన్, పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కిన కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాలకు కూడా మణిశర్మ సంగీతాన్ని అందించడం జరిగింది. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలంటేనే మ్యూజిక్ పరంగా కొంత డిఫరెంట్ స్టైల్ ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. 

 

కాగా ఆయన ఇమేజ్ కి తగ్గట్లుగా మణిశర్మ ఎప్పటికప్పుడు అద్భుతమైన సాంగ్స్ ఇస్తూ మంచి పేరు దక్కించుకునేవారు. చివరిగా పవన్, మణిశర్మ ల కాంబోలో వచ్చిన కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాలోని ఎక్స్ ట్రార్డినరీ, మెలికలు తిరుగుతుంటే సాంగ్స్ అప్పట్లో బాగా సక్సెస్ అయ్యాయి. అయితే పవన్, మణి ల కాంబోలో తొలిసారిగా వచ్చిన ఖుషి సినిమా సాంగ్స్ ని మాత్రం ఎప్పటికీ పవన్ అభిమానులు మరిచిపోలేరు అనే చెప్పాలి. ఆ విధంగా పవన్, మణిశర్మ లది పవర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పకతప్పదు ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: