సినిమాకు కథ, కథనం ఎంత ముఖ్యమో సంగీతం అంత ముఖ్యం. మన సినిమాల విజయాన్ని సగం నిర్ణయించేది సంగీతమే. తెలుగు సంగీతంలో అద్భుతాలు చేసిన సంగీత దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు ‘మణిశర్మ’. స్వరబ్రహ్మగా తెలుగు సినిమాలను శాసించాడు. దాదాపు 12ఏళ్లు తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ మ్యూజిషియన్ గా రాణించాడు. వర్మ సినిమాలతో బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ తో ఎంట్రీ ఇచ్చినా పూర్తి సంగీత దర్శకుడిగా ఎంటరైంది మాత్రం చిరంజీవి బావగారూ.. బాగున్నారాతో. అయితే మొదటగా విడుదలైంది ఏవీఎస్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హీరోస్ తో.

IHG

 

మణిశర్మ ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా ఆయనకు ఉన్న మరో ఖ్యాతి.. బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్. ఎన్నో సినిమాలకు తన రీరికార్డింగ్ తో ప్రాణం పోశాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు క్లైమాక్స్ లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ ఓ ఉదాహరణ. సినిమాలో హీరో ఎలివేషన్ కు మణిశర్మ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఆది, ఖుషి, తీన్ మార్, అతడు.. సినిమాల్లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మాయాజాలమే వినిపిస్తుంది. ఏ సీన్ కు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ఏ సీన్ ను ఎలా ఎలివేట్ చేయాలో మణిశర్మకు బాగా తెలిసిన విద్య.

IHG

 

ఓ సన్నివేశంలో లీనమైపోయేలా బ్యాక్ గ్రౌండ్ ఇవ్వడం మణిశర్మ స్పెషాలిస్ట్. మహేశ్ అతడుకు సగం బలం మణిశర్మే. పవన్ కల్యాణ్ తీన్ మార్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మణి ఇచ్చిన నేపథ్య సంగీతం హైలైట్. ప్రేమకథలు, ఫ్యాక్షన్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ అయినా అందుకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ ఇవ్వడంలో మణిశర్మ ఒన్ అండ్ ఓన్లీ స్పెషలిస్ట్ అనడంలో అతిశయోక్తి లేదు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: