కరోనా వైరస్ మహమ్మారి సినిమా ఇండస్ట్రీని అనేక రీతులుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. దాదాపు కరోనా లాక్డౌన్ వలన సినిమా షూటింగులు మూడు నెలలు వరకు ఆగిపోయాయి. ఇటువంటి తరుణంలో ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం తో పాటు షూటింగ్ జరుగుతున్న టైములో కొన్ని నిబంధనలు పాటించాలని సరికొత్త ఆదేశాలు ఇండస్ట్రీలకు ఇవ్వటం జరిగింది. షూటింగ్ జరిగే స్పాట్ లో ఖచ్చితంగా ఒక డాక్టర్ అదే విధంగా నర్స్ మరియు శానిటేషన్ చేసే బాయ్ ఉండాలని తెలపడం జరిగింది. ఇదే తరుణంలో కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలపడం జరిగింది.

IHG'There are some who threaten to slash my throat, I ...

మరోపక్క త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా షూటింగులు స్టార్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు వచ్చిన ప్రకటనపై ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా స్పందించారు. షూటింగులు ప్రారంభించాలని తానేమీ అనుకోవడం లేదని, సినిమా సెట్ లో సోషల్ డిస్టెన్స్ పాటించడం అసాధ్యమని, అలా జరగదు, జరగబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి టైమ్ లో ఒకవేళ షూటింగులు స్టార్ట్ చేసిన నిర్మాతలకు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని పేర్కొన్నారు.

IHG

అంతేకాకుండా నటీనటులకు సెట్ లో రక్షణ కల్పించాల్సి ఉంటుందని తేల్చారు. షూటింగ్ జరిగే స్పాట్ లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం మరోపక్క సినిమా షూటింగ్ జరుపుకోవడం అనేది ఈ రెండూ కలిసే విషయాలు కాదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి రూల్స్ పెడితే షూటింగులు చేయలేము. సెట్‌లో భౌతిక దూరం పాటిస్తామని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుందని అనుభవ్ సిన్హా తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: