కరోనా కాలంలో థియేటర్లు మూతబడడంతో జనాలందరూ ఓటీటీలకి బాగా అలవాటు పడ్డారు. ఈ సినిమాసినిమా అని తేడా లేకుండా ఏ భాషాలో సినిమా అయినా చూసేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో వెబ్ సిరీస్ లకి ప్రాముఖ్యం బాగా పెరిగింది. అందువల్ల చిత్ర నిర్మాతలు కూడా వీటిపై దృష్టి సారిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత అయిన అనిల్ సుంకర మొన్నటికి మొన్న మధుబాబు ఫేమస్ నవలా సిరీస్ షాడోని వెబ్ సిరీస్ గా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 

అయితే ఈ షాడో సిరీస్ లో హీరోగా ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తిగా ఉంది. మధుబాబు షాడో నవలకి అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. షాడో చేసే పనులు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అయితే ఆ పాత్రలో చేయడానికి ఎవరైతే బాగుంటారని ఆలోచిస్తున్నారట. తాజాగా ఈ సిరీస్ లో నటించడానికి రానా అయితే బాగుంటుందని భావిస్తున్నారట. అందుకని రానాని సంప్రదించారణీ టాక్ వినబడుతుంది.

IHG's 'Shadow' to be made into a web series - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> -  IndiaGlitz.com

మరి రానా ఒప్పుకున్నాడా లేదా అనేది తెలియదు. అయితే రానా చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. అరణ్య్ సినిమా రిలీజ్ కి రెడీ ఉంది. అదీగాక విరాట పర్వం ఇంకా కొంత భాగం షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఇంకా మళయాల చిత్రమైన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ లో రానా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంకా నిర్మాతగానూ చేతిలో సినిమాలున్నాయి.

 

మరి ఇంత బిజీగా ఉన్న రానా ఆ సిరీస్ చేయడానికి ఒప్పుకుంటాడా లేదా చూడాలి. రానా ఒప్పుకుంటే మాత్రం ఆ వెబ్ సిరీస్ రేంజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: