సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని ఎన్నో ఏళ్ళుగా వినబడుతుంది. ఈ విషయమై ఎన్నో చర్చలు జరిగాయి. అయితే ఎన్ని జరిగినా, ఎంత చేసినా ఈ సమస్య మాత్రం పోవడం లేదట. ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. మీటూ ఉద్యమం ద్వారా చాలా మంది హీరోయిన్లు తాము కూడా అలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నామని వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెళ్ళి చూపులు హీరోయిన్ రీతూ వర్మ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.

 

IHG

షార్ట్ ఫిలిమ్స్ నుండి హీరోయిన్ గా మారిన రీతూ వర్మ మొదటగా ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్ షా సినిమాలో కాజల్ పక్కన నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రేమ ఇష్క్, కాదల్ చిత్రం లో మెరిసింది. కానీ ఆమెకి పేరు తీసుకువచ్చింది మాత్రం పెళ్ళి చూపులు సినిమానే. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా కనిపించాడు. పెళ్ళి చూపులు సినిమాతో సక్సెస్ ని అందుకున్న రీతూ వర్మ.. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా కనిపించలేదు.

 

 

కేశవ సినిమాలో నిఖిల్ సరసన చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తెలుగులో అవకాశాలు రాకపోతేనేం తమిళంలో వరుసగా అవకాశాలని అందిపుచ్చుకుంటుంది. దుల్కర్ సల్మాన్ సరసన కనులు కనులను దోచాయంటే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం నాని సినిమా టక్ జగదీష్ లో నటిస్తున్న రీతూ, ఇండస్ట్రీలో తనకి ఎదురైన అనుభవాలని చెప్పుకొచ్చింది.

 

 

అందరూ చెప్పుకుంటున్న క్యాస్టింగ్ కౌచ్ తనకి ఎదురవ్వలేదట. తను పనిచేసిన వారందరూ వృత్తిపరంగా ఎంతో నిబద్ధత కలిగిన వారవడం చేత తనకెప్పుడూ అలాంటి అనుభవమే ఎదురు కాలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: