టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే సంగీతం పరంగా చూస్తే చాలా మందికి చాలా సినిమాలు నచ్చుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పే సినిమా చిరుత. రామ్ చరణ్ కెరీర్ లో  వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది  సంగీతం పరంగా. ఇప్పటికి కూడా దీనిని చాలా మంది రింగ్ టోన్ గా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే సినిమాలో సంగీతం ఏ రేంజ్ లో హిట్ అయింది అనేది అర్ధం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ గాని పాటలకు గాని మణిశర్మ అందించిన సంగీతం ఒక రేంజ్ లో హిట్ అయింది అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా చాలా బాగా సంగీతం హైలెట్ అయింది. 

 

ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ ఆలోచనకు తగిన విధంగా సంగీతం అందించారు మణిశర్మ అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఈ సినిమాలో సంగీతం విని చాలా మంది సినిమాను కూడా చూసారు. అప్పట్లో విడుదల చేసిన ఆడియో కి మంచి స్పందన వచ్చింది. సినిమా వచ్చి పదేళ్ళు దాటినా సరే జనాలు మాత్రం సంగీతం కచ్చితంగా వింటారు ఇప్పటికి అనే చెప్పాలి. ఈ సినిమాలో సంగీతం పై చాలా మంది కామెంట్స్ టాలీవుడ్ లో చేసారు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి కూడా సంగీతం ఎక్కువగా నచ్చింది అని అన్నారు. 

 

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ నటన కు చాలా మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమా అయినా సరే అతను చాలా బాగా నటించాడు అని చాలా మంది అన్నారు. ఇక అతనికి అక్కడి నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఫ్లాప్ కాదు హిట్ కాదు గాని రామ్ చరణ్ కి మంచి ఇమేజ్ తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: