కరోనా కారణంగా సినీ రంగం అంతా స్థంబించి పోయింది. అయితే ఈ సమయంలో కూడా ఒకరిద్దరు స్టార్స్ తమ పనులు తాము కానిచ్చేస్తున్నారు, ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకొవాల్సిన స్టార్ సల్మాన్ ఖాన్. లాక్‌ డౌన్‌ ప్రకటించగానే తన ఫాం హౌజ్‌కు వెళ్లిపోయిన సల్మాన్ అక్కడి నుంచే అన్ని పనులు చక్క బెట్టేస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న రాధే సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు లాక్‌ డౌన్‌లో పూర్తి చేస్తున్నాడు సల్మాన్‌.

 

అదే సమయంలో వరుసగా మ్యూజిక్ వీడియోలను కూడా రిలీజ్ చేస్తున్నాడు, ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియోతో పాటు కరోనా నేపథ్యంలో ప్యార్ కరోనా సాంగ్‌ను ఈద్ సందర్భంగా భాయ్ భాయ్‌ పాటలను రూపొందించి రిలీజ్ చేశాడు సల్మాన్‌. ఆ పాటలకు మంచి రెస్సాన్స్ రావటంతో ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

 

తాజాగా తన గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిసి మరో వీడియోను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఆ వీడియో కోసం లోకెషన్లు వెతికే పనిలో ఉన్నాడు సల్మాన్‌. తన గర్ల్‌ ఫ్రెండ్‌ లులియా వాంతూర్‌తో కలిసి లోకేషన్లు వెతికే వీడియోను సల్మాన్ సెక్యూరిటీ గార్డ్‌ షేరా షేర్  చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Following the Legend........ My Maalik @Beingsalmankhan #Salmankhan #Legend #Sheraa #Beingsheraa

A post shared by Being Sheraa (@beingshera) on

మరింత సమాచారం తెలుసుకోండి: