థియేటర్లు మూతబడి సినిమాలు లేక వినోదాన్ని మిస్సవుతున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మారిన ఓటీటీలు కొంతమేర ఆ లోటుని తీరుస్తున్నాయి. అయితే థియేటర్ లో చూసిన అనుభవం ఓటీటీలో రాకపోయినా ప్రస్తుతానికి సినిమా ప్రియులకి ఉన్న అవకాశం అదొక్కటే కాబట్టి తప్పదు. ఓటీటీకి బాగా డిమాండ్ పెరగడంతో చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

 

అలా ఈ మధ్య రిలీజైన చాలా సినిమాల్లో రెండు తెలుగు చిత్రాలు మంచి స్పందనని తెచ్చుకున్నాయి. అల్లు అరవింద్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న భానుమతి అండ్ రామక్రిష్ణ, క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రాలకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ రెండు సినిమాలతో ఆహా సబ్ స్క్రయిబర్స్ బాగా పెరిగారట. ఇప్పటి వరకూ ఈ రెండు చిత్రాలకి కలిపి 20లక్షల వ్యూస్ వచ్చాయట.

 

ఇందులో భానుమతి రామక్రిష్ణ చిత్రం పరిణతి చెందిన ప్రేమ కథ కాగా, క్రిష్ణ అండ్ హిస్ లీల రొమాంటికి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. భానుమతి రామక్రిష్ణ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా చేసాడు. హీరోగా సలోని లుత్రా కనిపించింది. ఈ సినిమాకి శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించాడు.

 

ఇక క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగ నటించగా హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, షాలినీ వడ్నికత్తి, సీరత్ కపూర్ నటించారు. అడవి శేష్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ క్షణం సినిమాని తెరకెక్కించిన రవికాంత్ పేరెపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కారణంగానే మరిన్ని తెలుగు చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. మొత్తానికి ఆహా టీమ్ మంచి సినిమాలనే దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: