మన తెలుగులో ప్రభాస్ అనగానే యాక్షన్ సినిమాలు అనే పేరు బిల్లా సినిమా నుంచి జనాలకు వచ్చేసింది. అక్కడి నుంచి కూడా ప్రభాస్సినిమా చేసినా సరే కచ్చితంగా యాక్షన్ సినిమాలు అనే అభిప్రాయం చాలా మంది టాలీవుడ్ జనాలకు కూడా వచ్చింది అనే చెప్పాలి. ఇక ప్రభాస్ చేసే సినిమాలు కూడా దాదాపు అదే విధంగా ఉంటాయి. బిల్లా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కాస్త యాక్షన్ సినిమా. బిల్లా అనే పాత్రకు సంబంధించి మాత్రం ఇది యాక్షన్ సినిమా అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆయన నటన కు చాలా మంచి మార్కులు పడ్డాయి. 

 

కథలో బలం లేక సినిమా ఫ్లాప్ అయింది గాని ఈ సినిమాలో ప్రభాస్ మాత్రం ఒక రేంజ్ లో నటించాడు అనే చెప్పాలి. ఈ సినిమా విషయానికి వచ్చి చూస్తే ప్రత్యేకంగా సంగీతం కి చాలా మంచి ప్రాధాన్యత అనేది సినిమాలో ఉంది అనే చెప్పాలి. అవును సంగీతం విషయంలో దర్శకుడు మణిశర్మ ప్రాణం పెట్టి చేసారు. యాక్షన్ సన్నివేశాలకు తగిన విధంగా ఆయన అప్పుడు సంగీతం అందించారు. అప్పటి వరకు ప్రభాస్ కి ఆ రేంజ్ లో ఎవరూ కూడా సంగీతం ఇవ్వలేదు అని అంటారు. ఆ సినిమా కొంతమేర హిట్ అయింది అంటే కచ్చితంగా సంగీతం  చాలా మందికి  నచ్చడం కూడా.

 

యాక్షన్ సీన్స్ లో అయితే మణిశర్మ ఒక రేంజ్ లో ఒక ఊపు ఊపారు ఆనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా ఆయన చాలా బాగా సంగీతం అందించారు. ప్రభాస్ రేంజ్ కి తగిన విధంగా సంగీతం అందించారు ఆయన అని చాలా మంది అంటూ ఉంటారు. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: