మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పే సినిమా అర్జున్. ఈ సినిమాలో మహేష్ బాబు నటన తన అక్క కోసం పడే తపన అన్నీ కూడా అప్పట్లో జనాలకు చాలా బాగా  నచ్చాయి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి అంటూ చాలా మంది అప్పట్లో ఈ సినిమా చూసి కామెంట్స్ కూడా చేసారు. ఈ సినిమాల్లో మహేష్ నటనకే చాలా మార్కులు పడ్డాయి. కథ ఏవిధంగా ఉన్నా సరే సినిమాను మాత్రం ఫాన్స్  బాగా ఆదరించారు అనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ నటన తో పాటుగా ప్రకాష్ రాజ్ నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంది. 

 

ఇక ఈ సినిమా సంగీతం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో సినిమాకు ఒక రేంజ్ లో ఊపు వచ్చింది అంటే క్లాస్ ఆడియన్స్ కి  సినిమా బాగా ఎక్కింది అంటే అందులో సంగీతం కూడా. ఎక్కడా కూడా ఓవర్ గా సంగీతం లేకపోవడం తో జనాలు కూడా ఈ సినిమా సంగీతాన్ని బాగానే విన్నారు అనే మాట చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రతీ సీన్ లో కూడా సంగీతం మణిశర్మ ప్రాణం పెట్టి అందించారు అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రేంజ్ కూడా భారీగా పెరిగింది అనే చెప్పాలి. 

 

ఇక్కడి నుంచి మహేష్ కోసం మంచి కథలాను రెడీ కూడా చేసి ఉంచారు. అయితే అక్కడి నుంచి మహేష్ కాస్త ఇబ్బంది  పడి తొందరపడి సినిమాలు చేసారు అని కూడా అంటూ ఉంటారు. ఈ సినిమాలో మహేష్ నటన కు అవార్డ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడికి కూడా మంచి పేరు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: