చిరంజీవి కెరీర్ లో వచ్చిన  భారీ అంచనాల సినిమా అంజీ. ఈ  సినిమాపై చిరంజీవి కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు అప్పట్లో. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం ఇచ్చారు కూడా. ఈ సినిమాలో చాలా సీన్స్  కోసం ఆయన నానా బాధలు పడ్డారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా చూసిన చాలా మంది వామ్మో ఈ సినిమా ఏంటి ఇలా ఉంది అంటూ సినిమా చూసి వచ్చిన తర్వాత కామెంట్ చేసారు అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఉన్న సంగీతం మాత్రం ఒక రేంజ్ లో హైలెట్ అయింది అనే చెప్పాలి. 

 

అవును సంగీతం మాత్రం ఒక రేంజ్ లో హిట్ అయింది అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ కి కూడా మణిశర్మ చాలా అందంగా సంగీత౦ అందించారు అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఆయన ప్రతీ సీన్ కోసం చాలా బాగా కష్టపడ్డారు అని అంటారు. ఏ సీన్ ఏ విధంగా ఉన్నా సరే ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు. తన సంగీతం తో చాలా బాగా ఆకట్టుకున్నారు. చిరంజీవి కూడా ఈ సినిమా సంగీతం, గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మణిశర్మ కాస్త అసహనం వ్యక్తం చేసారు అని అంటారు. 

 

ఇక అక్కడి నుంచి కూడా ఆయన చాలా రకాలుగా జాగ్రత్తలు పడ్డారు అని చెప్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కూడా చాలా బాగా జాగ్రత్త పడ్డారు అనే చెప్పాలి. ఆయన ప్రతీ ఒక్క విషయాని కూడా ఒకటికి పది సార్లు ఆలోచన చేసి సినిమాలు అప్పటి నుంచి చేసారు. ఇక ఈ సినిమాలో ఆయనలో ఒక భయం కూడా పెట్టింది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: