మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా అతిధి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద ఫ్లాప్ గా ఉంది. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా చాలా దారుణం అని ఇప్పటికి కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఈ సినిమాను మహేష్ బాబు అనవసరంగా చేసాడు అని చాలా మంది ఇప్పటికి అనే వాళ్ళు ఉన్నారు. సినిమా కథ చాలా మందికి ఎక్కలేదు ఒకటి అయితే సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు బాధ పెట్టాయి కొందరిని. 

 

చిన్న చిన్న సన్నివేశాల విషయంలో ఎక్కువగా సమయం వెస్ట్ చేసారు అని చాలా మంది అన్నారు. అనవసరంగా కథలో లేని పోనీ వి యాడ్ చేసి సినిమా చేసారు అని అన్నారు. అందుకే సినిమా  ఫ్లాప్ అయింది అని అంటూ ఉంటారు. అయితే ఈ సినిమాలో సంగీతం మాత్రం సినిమాకు న్యాయం చేసింది అనే మాట స్పష్టంగా చెప్పవచ్చు. అవును ప్రతీ సీన్ కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమాలో అనే చెప్పాలి. సంగీతం విషయంలో మాత్రం మణిశర్మ ఏ విధంగా కూడా ఈ సినిమాకు అన్యాయం చేయలేదు అని చాలా మంది అంటూ ఉంటారు. 

 

కథకు తగిన విధంగా ఆయన అందించారు అని అంటూ ఉంటారు. స్టార్ హీరో సినిమా కావడం తో అంచనాలు ఉంటాయి అని ఆ అంచనాలకు తగిన విధంగా ఆయన సంగీతం అందించారు అని అంటారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కూడా చాలా జాగ్రత్త పడి ప్రయోగాల విషయం అనగానే కాస్త వెనక్కు తగ్గే వాతావరణం అయితే మనం చూసాం అనే చెప్పాలి. ఇప్పటికి మహేష్ బాబు లో ఆ భయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: