నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన సున్నితమైన ఎమోషన్స్ కలిగి ఉన్న చిత్రం జెర్సీ.. క్రికెట్ ఆటగాడిగా నాని ఎంత ప్రొఫెషనల్ గా అనిపించాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ కనిపించింది. తెలుగులో మొదటి సినిమానే అయినా అంత మంచి పాత్ర దక్కడం ఆమె అదృష్టమనే చెప్పాలి. జెర్సీ సినిమాలో ఆమె గ్లామర్ తో పాటు నటన ఓ రేంజ్ లో ఉంటుంది.

 

ఆ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ చూసిన వారందరూ ఆమె పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ చూసి నోరెళ్ళబెట్టారు. నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేయడంతో అందరి దృష్టి హీరోయిన్ మీదే పడింది. అయితే అంత మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్ ఎక్కువ సినిమాల్లో నటించలేదు. మొన్నటికి మొన్న క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రంలో మరొక్కసారి కనిపించింది.

 

ఈ సినిమాతోనూ ఆమెకి మంచి పేరే వచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో మరింత గ్లామర్ గా కనిపించి యూత్ ని కితకితలు పెట్టింది. దీంతో శ్రద్ధా శ్రీనాథ్ వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించింది. ఇప్పటి వరకూ తెలుగులో ఆమె చేసిన ఏ సినిమాలోనూ అంత ఎక్స్ పోజింగ్ చేయలేదు.

 

కానీ ఫోటోషూట్లో మాత్రం మాత్రం అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మొత్తానికి అమ్మడు ఎక్స్ పోజింగ్ కూడా రెడీ అని చెప్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న విశాల్ చక్ర సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: