జూనియర్ ఎన్టీఆర్ కెరీర్  లోనే ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన సినిమా ఆది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. తారక్ కెరీర్ ని ఒక ఊపు ఊపిన సినిమా ఇది అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో తారక్ నటన గాని ఈ సినిమా సంగీతం గాని ఒక రేంజ్ లో ప్రేక్షకులకు నచ్చాయి అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర౦ లేదు.  ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా హిట్స్ వచ్చాయి అనే సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో సంగీతం ఒక రేంజ్ లో హైలెట్ అయింది. 

 

సినిమా సంగీతం కి అవార్డ్ లు కూడా వచ్చాయి. ప్రధానంగా కొన్ని కొన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ అయితే ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆ సంగీతమే  అప్పట్లో హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. తారక్ కెరీర్ లో ఈ సినిమా ఒక సంచలనం అవడం లో సంగీతం కూడా తన వంతు పాత్ర అప్పట్లో పోషించింది అనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సంగీతం తర్వాత సంగీత దర్శకుడు మణి శర్మ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. హీరో కి తగిన విధంగా సంగీతం అందిస్తారు అనే పేరు ఆయనకు చాలా ఫాస్ట్ గా వచ్చింది. 

 

ఇక ఈ సినిమాలో ఆయన అందించిన సంగీతం అదే విధంగా ఉండటం తో ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు అప్పట్లో ముందుకు వచ్చారు. అందరు హీరోలతో దాదాపుగా ఆయన సంగీత దర్శకుడిగా పని చేసారు అనే చెప్పాలి. ఇప్పటికి ఆయనకు అదే రేంజ్ లో క్రేజ్ ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: