మెలోడీ బ్రహ్మగా పేరొందిన సంగీత దర్శకుడు మణిశర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకప్పుడు ఈయన లేని సినిమా లేదు అంటే అతిశ‌యోక్తి కాదేమే. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమా అంటే కచ్చితంగా మణిశర్మ సంగీతం ఉండాల్సిందే అనేవారు. ఏ.వి.యస్ తొలిసారి దర్శకత్వం వహించిన `సూపర్ హీరోస్` చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు రెండు వంద‌ల‌ చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. అయితే సంగీత దర్శకుడుగా ఆయన కొచ్చిన తొలి అవకాశం చిరంజీవి సినిమానే అయినా విడుదలయింది మాత్రం సూపర్‌ హీరోస్‌.

 

ఇక బావగారూ బాగున్నారా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో ఇండస్ట్రీలో మ‌ణిశ‌ర్మ‌కు మంచి పేరొచ్చింది. ఆ త‌ర్వాత ఈయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా పోస్ట‌ర్ చూసినా ఈయ‌న పేరే క‌నిపించేది. దీంతో మోస్ట్ వాంటెడ్ సంగీత ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు మ‌ణిశ‌ర్మ‌. కాక‌పోతే ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైనా ఓ టైమ్ వ‌ర‌కే అన్నీ న‌డుస్తాయి. అందుకు మ‌ణిశ‌ర్మ కూడా మిన‌హాయింపు కాదు. ఈయ‌న‌ కూడా కొన్ని రోజుల పాటు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఎస్.ఎస్.తమన్, అనిరుధ్, మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్ వంటి సంగీత దర్శకులు స్టార్ హీరోలతో పనిచేయడంతో మణిశర్మ వెనకబడిపోయారు.

 

అయితే ఇప్పుడు మళ్ళీ ఈయన దూకుడు మొదలైన‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో మణిశ‌ర్మ  ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో ప్ర‌తి సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాలోని పాట‌ల‌కు త‌న ప్రాణం పెట్టేసాడు మ‌ణిశ‌ర్మ‌. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణి కోసం మళ్లీ స్టార్ హీరోలు వస్తున్నారు. ముఖ్యంగా దేవీ జోరు తగ్గించడం.. తమన్ రొటీన్ అయిపోవడంతో మళ్లీ మణిశర్మ గుర్తుకొస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయన  రామ్ రెడ్, వెంకటేష్ నార‌ప్ప, చిరంజీవి, కొరటాల శివ సినిమాతో పాటు ఫైటర్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు మణిశర్మ.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: