ఈరోజు ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ తన 56వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతనిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. తెలుగు పాటలను వినేవారు, తెలుగు సినిమాలను చూసే ప్రతి ఒక్కరికి మణిశర్మ గురించి తెలిసే ఉంటుంది. సంగీత ప్రియులకు ఇళయరాజా అంటే ఎంత ఇష్టమో మణిశర్మ కూడా అంతే ఇష్టం అంటే అతిశయోక్తి కాదు. సంగీతంలో సరిగమపదనిస లో 'మ' రాగానికి రూపం వస్తే అచ్చం మణి శర్మ లాగానే ఉంటుందేమో అని తెలుగు శ్రోతలు అంటుంటారు.


కీబోర్డ్ ప్లేయర్ గా ఎన్నో సంవత్సరాల పాటు పని చేసి ఎంతో ప్రావీణ్యం పొందిన మణి శర్మ ఒక్కసారి కీబోర్డ్ వాయిస్తే సాహిత్యం, సరస్వతి సంగీతం రూపంలో మన చెవిలో నాట్యం చేస్తాయి. సినిమా సంగీత ప్రపంచంలో తాను అరంగేట్రం చేసి 30 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ... తన సినిమా కెరీర్ లో హీరో ఇంట్రడక్షన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చడం, హీరోయిన్ ఇంట్రడక్షన్ కి సంగీతం అందించడం, మధ్యలో డ్యూయెట్ సాంగ్స్ కి సంగీతం అందించడం, అకస్మాత్తుగా వచ్చే ఐటం సాంగులకు సంగీతం సమకూర్చడం, క్లైమాక్స్ సన్నివేశాల్లో మనసును హత్తుకునే సంగీతం సమకూర్చడం వంటివి ఎన్నో చేసినప్పటికీ... అతనికి మెలోడీ పాటలకుుు ఉన్న అనుబంధాన్ని వేరు చేయలేనిది అని చెప్పుకోవచ్చు.


అతను వాయిస్తున్న కీ బోర్డు నుండే నేరుగా వచ్చే సంగీత స్వరాలు, మెలోడీ పాటలు ఎంతటి కఠినమైన వారి మనసునైనా అత్యంత సులభం గా మారుస్తాయి. ఒక్కసారి మణి శర్మ మెలోడీ పాటలను వింటే ఎంతటి బాధ అయినా తగ్గిపోతుంది. దాదాపు మూడు దశాబ్దాలలో అతను స్వరపరిచిన మెలోడీ పాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఫిదా చేసే సాయి. అందుకే మణిశర్మ ని ప్రతి ఒక్కరూ మెలోడీ బ్రహ్మ అని పిలుస్తుంటారు. ఏదేమైనా ఇలాంటి గొప్ప సంగీత విద్వాంసుడు తెలుగు పరిశ్రమలో అరంగేట్రం చేయడం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవచ్చు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: