వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే పేరుతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో స్టిల్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అలాగే పవర్ స్టార్ మూవీ కి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసే పెద్ద దుమారం లేపాడు. ఈ సినిమా పోస్టర్ లో పవర్ స్టార్ అనే లోగో లోనిరెండు పదాల మధ్య ఒక గ్లాసు ఉండగా... అది పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ యొక్క గుర్తు అని, ఈ పవర్ స్టార్ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జీవితచరిత్ర మీదనే రూపొందిస్తున్నారని అనేక వార్తలు వెల్లువెత్తాయి.
ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ అందరూ లైట్ తీసుకోండి అని చెప్పుకొచ్చారట. అయితే పవర్ స్టార్ సినిమా ఎవరినీ కించపరచడానికి తెరకెక్కించడం లేదని రామ్ గోపాల్ వర్మ ఏకంగా బాలాజీ దేవుడిపై ఒట్టు కూడా వేశాడు. అసలు దేవుడిని నమ్మని రామ్ గోపాల్ వర్మ దేవునిపై ఒట్టు వేసాడు అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అయ్యుంటుందని నెటిజన్లు తెగ ఊహాగానాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు.ఆ పోస్టులో... 'పవర్ స్టార్ అనే టైటిల్ లోగో లో టీ గ్లాసు పెట్టడానికి కారణం ఏమిటంటే ఈ సినిమాలో నటించే కథానాయకుడు ఎక్కువగా టీ తాగుతాడు. అందుకే టీ గ్లాసు లోగో మధ్యలో పెట్టాను. అంతే కానీ ఎటువంటి రాజకీయ కారణాలతో కాదు. శివ సినిమా టైటిల్ లో కూడా సైకిల్ చైన్ ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలోని హీరోయిన్ సైకిల్ ఎంతో ఎక్కువగా కొడుతుంటాడు', అని పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ కి నెటిజన్లు హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన అనేక స్టిల్స్ విడుదల చేస్తూ వాటిపై హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన అభిమానులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: