టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న చిన్న హీరోయిన్ ల నుంచి పెద్ద పెద్ద  హీరోయిన్ ల వరకు కూడా సినిమాల విషయంలో కాస్త వెనక్కు తగ్గుతున్నారు. చిన్న చిన్న హీరోయిన్ లకు కాస్త కష్టంగా ఉంది పరిస్థితి అని అంటున్నారు. దాదాపుగా ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న హీరోయిన్ ల భవిష్యత్తు మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు లో చిన్న హీరోల సినిమాలకు కూడా స్టార్ హీరోయిన్ లు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి  నిజమా కాదా అనేది చూడాలి అంటే మాత్రం ఇప్పుడు కొన్ని విషయాలు చూడాలి. 

 

హీరోయిన్ లకు చాలా కష్టంగా ఆఫర్లు వస్తున్నాయి.  స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు కమర్షియల్   గా సినిమా లు చేసే వాతావరణం ఉంది మన తెలుగు లో అనే విషయం స్పష్టంగా చెప్పాలి.  ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు భారీగా ఖర్చు చేసి అయినా సరే స్టార్ హీరోయిన్ ని పెడితే కథ కాస్త జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం అది సూపర్ హిట్ అయితే ఇక తిరుగు ఉండదు అని  సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఒక మోస్తరు హీరో నుంచి  కూడా ఇదే విధంగా ప్లాన్ చేస్తున్నారు. 

 

చిన్న హీరోయిన్ లకు అసలు చిన్న హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు రావడం లేదు అని అంటున్నారు. వారి స్థానం అగ్ర హీరోయిన్ లు ఆక్రమించడం తో ఇప్పుడు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారు చాలా వరకు కూడా తెలుగు నుంచి బయటకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు మరి. కొత్త హీరోయిన్ లు ఎవరూ కూడా తెలుగులో ట్రై చేయడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: