మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ రోజు తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తన 30 ఏళ్ళ సినీ కెరీర్ లో అతను సంగీతదర్శకునిగా పనిచేసిన ఉత్తమ చిత్రాల గురించి తెలుసుకుందాం. మణి శర్మ మొట్టమొదటిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రాత్రి సినిమాకి సంగీతం సమకూర్చారు. ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చూడాలని ఉంది మూవీకి సంగీతం సమకూర్చారు. కమెడియన్ ఏవీఎస్ దర్శకత్వం వహించిన సూపర్ హీరో సినిమాకి కూడా ఇతనే సంగీతం అందించారు. 1998 వ సంవత్సరంలో విడుదలైన చూడాలని ఉంది సినిమా లో రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యమహా నగరి కలకత్తా పురి అనే పాట కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒ మారియ ఒ మారియ, మనస్సా ఎప్పుడొచ్చావ్, సింబలే సింబలే పాటలు కూడా తెలుగు సినిమా శ్రోతలను బాగా అలరించాయి. దీంతో మణిశర్మ కెరియర్ లో చూడాలని ఉంది ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది.


1998లో విడుదలైన బావగారు బాగున్నారా చిత్రంలో చిరంజీవి రంభ హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని మూడు పాటలు నవమి దశమీ తగిన రోజులు, సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారీ, ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ కి మంచి పేరు వచ్చింది. బావగారు బాగున్నారా చిత్రం కూడా అతని కెరీర్లో ఒక గొప్ప చిత్రం అని చెప్పుకోవచ్చు.


2001 వ సంవత్సరంలో విడుదలైన నరసింహ నాయుడు చిత్రంలో బాలకృష్ణ సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులోని కో కో కోమలి, లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా, చిలకపచ్చ కోక , నిన్నా కుట్టేసినది పాటలు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత పాపులారిటీ సంపాదించి రికార్డులు తిరగరాసాయని అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా అనే పాట రెండు సంవత్సరాల పాటు పాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. కెరీర్ తొలినాళ్లలోనే ఇటువంటి భారీ చిత్రాలకు అద్భుతంగా సంగీతం అందించి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మణి శర్మ. అతని సినీ కెరీర్లో పోకిరి, ఖుషి, మురారి, చిరుత, పరుగు, బిల్లా, ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి( అందాల ఆడబొమ్మ సాంగ్ ), ఇద్దరు మిత్రులు, రాజకుమారుడు, ఆది, గుడుంబా శంకర్( ఏమంటారో, చిగురాకు చాటు చిలక), అతడు( నీతో చెప్పనా) వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.






Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: