తెలుగులో మెగాస్టార్ క్రేజ్ ఉన్న చిరంజీవి బాలీవుడ్ లో కూడా సత్తా చాటారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘గ్యాంగ్ లీడర్’ ను హిందీలోకి రీమేక్ చేశారు. ‘ఆజ్ కా గూండారాజ్’గా బాలీవుడ్ లో చేసి గట్టి ఇంపాక్ట్ చూపించారు. 28ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం విశేషం. తెలుగులో విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఆ సినిమాను హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఎన్.ఎన్ సిప్పీ నిర్మాణంలో తెరకెక్కిన ఆ సినిమా 1992 జూలై10న విడుదలైంది.

IHG

 

చిరంజీవి డ్యాన్సులు, మాస్ యాక్టింగ్ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ లో చిరంజీవి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ బాలీవుడ్ షేక్ అయిపోయింది. ప్రభుదేవా కంపోజింగ్ లో ఒరిజినల్ తెలుగు వెర్షన్ కు మించి అత్యంత క్లిష్టమైన డ్యాన్సులు చేశారు చిరంజీవి. దీంతో హిందీలో కూడా ఆ సినిమా భారీ హిట్ సాధించి చిరంజీవికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆజ్ కా గూండారాజ్ హిందీతోపాటు తెలుగులో 100 రోజులు ఆడటం విశేషం. ఇదొక రికార్డుగా మిగిలిపోయింది. చిరంజీవికి జోడీగా మీనాక్షీ శేషాద్రి నటించింది.

IHG

 

చిరంజీవి ఫ్రెండ్స్ లో ఒకడిగా హిందీలో రవితేజ నటించాడు. చిరంజీవికి ఒక అన్నయ్యగా రాజ్ బబ్బర్ నటించారు. సిప్పీకి ఈ సినిమా అక్కడ భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. బాలీవుడ్ లో చిరంజీవి పేరు మోగిపోయింది. 1994లో ది జెంటిల్ మేన్ తర్వాత 25ఏళ్లు హిందీలో సినిమా చేయలేదు చిరంజీవి. 2019లో సైరా.. తోనే బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అక్కడి మీడియా ఇంటరాక్షన్ లో చాలా మంది ‘ఆజ్ కా గూండారాజ్ లోని చిరంజీవి డ్యాన్స్ గురించి ప్రస్తావించడం విశేషం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: