మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు పాటకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిన సంగీత దర్శకులలో మ‌ణిశ‌ర్మ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ముఖ్యంగా ఆయన మెలోడీలకు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు ఎంద‌రో అభిమానులు ఉన్నారు. ఇక‌ 2000 ఆరంభం అటూ ఇటూ లో అటు టాప్ హీరోలకు, ఇటు యువ హీరోలకు సమానంగా సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ఘనత మణిశర్మది. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులకైతే మణిశర్మ అందించిన మ్యూజికల్ హిట్స్ చాలానే ఉన్నాయి. 

 

వాటిల్లో రికార్డులు క్రియేట్ చేసిన‌వి కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో మ‌హేష్ బాబు మురారి సినిమా కూడా ఒక‌టి.  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతదర్శకత్వం వహించారు. 2001లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ అందుకుంది. ఉసురు తగలడం వల్ల ఒక వ్యక్తి వంశం ఎలా దెబ్బతిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

 

మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువ చేసిన చిత్రం ఇది. అయితే మురారి సినిమా రేంజ్ పెర‌గ‌డానికి మ‌రియు హిట్ అవ్వ‌డానికి మ‌ణిశ‌ర్మ సంగీతం కీల‌క పాత్ర పోషించింది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందులో ప్ర‌తి పాటా సూప‌ర్ హిట్‌గానే నిలిచాయి. మ‌రీ ముఖ్యంగా 65 సంవత్సరాల వయసులో జిక్కీ గారితో మణిశర్మ పాడించిన `అలనాటి రామచంద్రుడు సాంగ్` ఒక సెన్సేషన్. ఈ పాటని క్లైమాక్స్ కి ముందు షూట్ చేస్తానని కృష్ణవంశీ అంటే అందరు అడ్డు చెప్పారు. కానీ అందరిని ఒప్పించి అదే పాటను తెరకెక్కించారు కృష్ణవంశీ. ఆ పాట, చిత్రీకరణ ఎంత ఆదరణ దక్కించుకున్నాయో తెలిసిందే. మ‌రియు ఇప్పటికీ ఆ పాట పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: