టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరక్టర్స్ లో మణిశర్మ ఒకరు. ఆయన మ్యూజిక్ అందిస్తున్న సినిమా రిలీజ్ కు ముందే తన సంగీతంతో హిట్ జోష్ వచ్చేలా చేసేవారు మణిశర్మ. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు. స్టార్ కాంబినేషన్స్ లో మణిశర్మ మ్యూజిక్ అంటే ఆడియో అదిరిపోవాల్సిందే. యువ హీరోలకు కూడా మణిశర్మ మంచి మ్యూజిక్ అందించారు. కీ బోర్డ్ ప్లేయింగ్ లో మణిశర్మ అదరగొట్టేస్తారు. దేవి శ్రీ ప్రసాద్ మణిశర్మ దగ్గర శిష్యరికం చేసి ఆ తర్వాత మ్యూజిక్ డైరక్టర్ గా మారాడు. ఇక మణిశర్మ ఇచ్చే మ్యూజిక్ లో చాలా స్పెషాలిటీ ఉంటుంది.

 

సినిమాకు కావాల్సిన మూడ్ క్రియేట్ చేయడంలో ప్రాముఖ్యత వహించే మ్యూజిక్ విషయంలో మణిశర్మ ఎప్పుడు ది బెస్ట్ ఇస్తూ వచ్చారు. మణిశర్మ సినిమాల్లో మాస్ సాంగ్స్ అదిరిపోతాయి. అంతేకాదు మెలోడీస్ కూడా అలరిస్తాయి. మణిశర్మ ఆల్బం ఉంది అంటే అందులో కనీసం ఒక సూపర్ మెలోడీ సాంగ్ ఉండాల్సిందే. క్లాస్ ఆడియెన్స్ కు మాత్రమే కాదు మాస్ ఆడియెన్స్ కు నచ్చే మ్యూజిక్ ఇవ్వడంలో కూడా మణిశర్మ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాడు. మణిశర్మ మొదట మ్యూజిక్ అందించిన సినిమా సూపర్ హీరోస్. అయితే అంతకుముందు ఆర్జివి అంతం సినిమాలో ఓ సాంగ్ కు మణిశర్మకు ఛాన్స్ ఇచ్చాడు.

 

రీమేక్ సినిమాలకు కూడా తన దైన మార్క్ మ్యూజిక్ ఇచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచేలా చేశాడు మణిశర్మ. ఈ తరం స్టార్ హీరోలకు కూడా వారి ఇమేజ్ కు తగినట్టుగా అదిరిపోయే మ్యూజిక్ అందించారు. సూపర్ హీరోస్ టూ ఇస్మార్ట్ శంకర్ దాదాపు 200పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ ఇంకా సినిమాలు చేయాలని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మణిశర్మకు ఇండియాహెరాల్డ్. కాం టీం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: