ఇప్పుడు మన తెలుగులో చాలా వరకు డిమాండ్ ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆమె తన సొంత భాషలో మాత్రమే కాదు ఇటు తెలుగు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేస్తుంది. ఎన్టీఆర్ తో మహేష్ బాబు తో కూడా ఆమె సినిమా చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా అనే దాని మీద స్పష్టత మాత్రం లేదు గాని ఆమె మాత్రం చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. 

 

ఇప్పుడు ఆమె పారితోషికం బాగా పెంచింది అనే వార్తలు వస్తున్నాయి. అవును ఆమె సినిమాల విషయంలో మంచి ఆఫర్లు వస్తున్న నేపధ్యంలో ఇక వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదు అని భావిస్తుంది. అందుకే ఇప్పుడు కాస్త రేటు విషయంలో కూడా ఆమె కఠినం గా ఉంది అని అంటున్నారు. వచ్చే రెండు మూడేళ్ళ పాటు ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల్లో ఆమె దాదాపుగా రెండు కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజమా కదా అనేది తెలియదు గాని స్టార్ హీరోలు మాత్రం ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

అందుకే పాప ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు దాదాపుగా ఆమె సినిమాల విషయంలో కాస్త కఠినం గా ఉండటమే మంచిది అనే ఆలోచనలో ఉంది అని అంటున్నారు. వచ్చే రెండు మూడేళ్ళ పాటు ఆమె సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోల తోనే ఉన్న నేపధ్యంలో ఆమె ఈ విధంగా ఆలోచన చేస్తుంది అని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: